ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘిస్తే…ట్రాఫిక్ పోలీసులు చలాన్లు విధిస్తారు. వీటిని సకాలంలో చెల్లించనట్లయితే అవి కాస్త పెండింగ్ చలాన్ల లిస్టులో ఉండిపోతుంటాయి. అయితే ట్రాఫిక్ పోలీసులు అప్పుడప్పుడూ పెండింగ్ చలాన్ల చెల్లింపును ప్రొత్సహించేందుకు డిస్కౌంట్లు ప్రకటిస్తుంటారు. తెలంగాణ సర్కార్ మరోసారి పెండింగ్ చలాన్లపై భారీ డిస్కౌంట్ ప్రకటించింది. దీనికి సంబంధించి జీవో కూడా విడుదల చేసింది. టూవీలర్లు, త్రీ వీలర్లు 80శాతం, తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణ సంస్థకు చెందిన బస్సులు 90శాతం కార్లు, హెవీ మోటార్ వెహికల్స్ కు 60శాతం డిస్కౌంట్ ను ప్రకటించింది. వాహనదారులు తమ వాహనాలపై ఉన్న పెండింగ్ చలాన్స్ పై డిస్కౌంట్ తో చెల్లించవచ్చు.
పూర్తిగా చదవండి..Pending Challan: పెండింగ్ చలాన్స్ పేటీఎంలో ఇలా చెల్లించండి..!!!
మీ వాహనాలపై ఉన్న పెండింగ్ చలాన్లపై పేటీఎంలో చెల్లించుకోవచ్చు. టూవీలర్లు, త్రీ వీలర్లకు 80 శాతం, తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కు చెందిన బస్సులకు 90 శాతం, కార్లు, హెవీ మోటార్ వెహికిల్స్‌కు 60 శాతం డిస్కౌంట్ ప్రకటించింది.
Translate this News: