OTT: ఈవారం ఓటీటీ.. సందడే సందడి

ఈ వీకెండ్ ఓటీటీ మోతెక్కిపోనుంది. దాదాపు అన్ని ఓటీటీ సంస్థలు ఈ వారాంతం పెద్ద సినిమాలతో రెడీ అయ్యాయి. సెప్టెంబర్ చివరి వారం కోసం ఎన్నో సినిమాలు, వెబ్ సిరీస్ లు సిద్ధంగా ఉన్నాయి. ఈసారి ఓటీటీలో రెట్టింపు వినోదం అందుబాటులోకి రాబోతోంది.

OTT: ఈవారం ఓటీటీ.. సందడే సందడి
New Update

ఈ వీకెండ్ ఓటీటీ మోతెక్కిపోనుంది. దాదాపు అన్ని ఓటీటీ సంస్థలు ఈ వారాంతం పెద్ద సినిమాలతో రెడీ అయ్యాయి. సెప్టెంబర్ చివరి వారం కోసం ఎన్నో సినిమాలు, వెబ్ సిరీస్ లు సిద్ధంగా ఉన్నాయి. ఈసారి ఓటీటీలో రెట్టింపు వినోదం అందుబాటులోకి రాబోతోంది.

ముఖ్యంగా అక్కినేని అభిమానుల కోసం అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఏజెంట్ సినిమా రాబోతోంది. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఘోర పరాజయం పాలైనప్పటికీ, ఓటీటీలో వస్తే చూసి ఎంజాయ్ చేయడానికి చాలామంది రెడీగా ఉన్నారు. ఏప్రిల్‌లో విడుదలైన ఈ చిత్రం చాన్నాళ్లుగా ఓటీటీలోకి రాకుండా దోబూచులాడింది. ఎట్టకేలకు ఈ నెలాఖరుకు రాబోతోంది. సోనీ విల్ లో ఏజెంట్ సినిమాను స్ట్రీమింగ్ కు పెట్టబోతున్నారు.

సురేందర్ రెడ్డి, అఖిల్ కాంబోలో వచ్చిన ఏజెంట్ సినిమాకు ఓటీటీలో కూడా పోటీ తప్పలేదు. సెప్టెంబర్ 29న ఏజెంట్ వస్తుంటే, అక్టోబర్ 1 నుంచి ఖుషి సినిమా స్ట్రీమింగ్ కు రెడీ అయింది. విజయ్ దేవరకొండ, సమంత హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కు రెడీ అయింది.

ఈ సినిమాలతో పాటు, నిత్యా మీనన్ నటించిన కుమారి శ్రీమతి వెబ్ సిరీస్ కూడా సిద్ధంగా ఉంది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో సెప్టెంబర్ 28 నుండి అందుబాటులో ఉంటుంది. దుల్కర్ సల్మాన్ తాజా చిత్రం, బాక్సాఫీస్ వద్ద పెద్ద డిజాస్టర్ అయిన కింగ్ ఆఫ్ కోత కూడా వచ్చేస్తోంది. డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో సెప్టెంబరు 28న దుల్కర్ సినిమా ప్రత్యక్షమౌతుంది.

నెట్ ఫ్లిక్స్ లో గాండీవధారి అర్జున ఆల్రెడీ అందుబాటులోకి రాగా.. ఐస్ కోల్డ్, లవ్ ఈజ్ ఇన్ ఎయిర్ అనే 2 హాలీవుడ్ సినిమాలు 28 నుంచి స్ట్రీమింగ్ కాబోతున్నాయి. దీంతో పాటు ది డెవిల్స్ ప్లాన్ అనే కొరియన్ సిరీస్ కోసం చాలామంది వెయిట్ చేస్తున్నారు. అటు అమెజాన్ ప్రైమ్ లో కుమారి శ్రీమతి వెబ్ సిరీస్ తో పాటు హాస్టల్ డేస్ హిందీ వెర్షన్, జెన్ వి అనే వెబ్ సిరీస్ రాబోతున్నాయి. ఇక తెలుగు ఓటీటీ వేదిక ఆహాలో పాపం పసివాడు అనే వెబ్ సిరీస్ కూడా సిద్ధంగా ఉంది.

#aha #netflix #kushi #amazon-prime #agent #g5
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe