/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/FotoJet-2024-06-02T185909.891.jpg)
ఏపీలోని అన్నమయ్య జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. రాయచోటి ఎస్పీ కార్యాలయం వద్ద ఓ ఏఆర్ మహిళా కానిస్టేబుల్ తుపాకితో కాల్చుకొని ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. సమాచారం మేరకు పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. మృతురాలిని వేదవతిగా గుర్తించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆమె ఎందుకు తుపాకితో కాల్చుకొని ఆత్మహత్య చేసుకుంది అనే దానిపై ఇంకా క్లారిటీ లేదు. ప్రస్తుతం ఈ ఘటనపై పోలీసులు విచారణ చేస్తున్నారు.
Also Read: జూన్ 3న ఆకాశంలో అరుదైన దృశ్యం.. ఆరు గ్రహాలను చూడొచ్చు