APPSC Group-1 Mains : ఏపీ (AP) లో గ్రూప్1 మెయిన్స్‌కు 1:100 నిష్పత్తి ప్రకారం అభ్యర్థులను ఎంపిక చేయాలని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల (YS Sharmila) కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గ్రూప్2, డిప్యూటీ DEO పోస్టుల ఎంపికలో 1:100 విధానాన్ని అనుసరించినట్లే, గ్రూప్ 1 మెయిన్స్ కి సైతం ఈ పద్ధతిని పరిగణనలోకి తీసుకోవాలని కోరారు.
ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టిన షర్మిల.. 'సీఎం చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) గ్రూప్ 1 ప్రిలిమ్స్ రాసిన అభ్యర్థుల పక్షాన మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాం. గ్రూప్ 2, గ్రూప్ 1 పరీక్షలకు మధ్య సమయం తక్కువగా ఉంది. కేవలం మూడు వారాల వ్యత్యాసంలోనే రెండు పరీక్షలు జరగడంతో అభ్యర్థులు గ్రూప్ 1 సిలబస్‌ను రివిజన్ చేయలేకపోతున్నారు. కొత్త సిలబస్ అని చెప్పి పాత సిలబస్ లోనే ప్రిలిమ్స్ పరీక్షలు పెట్టడం లాంటి కారణాలతో నష్టపోయామని అభ్యర్థులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. అభ్యర్థుల జీవితాలకు సంబంధించిన అంశం కాబట్టి దీనిపై వెంటనే సాధ్యసాద్యాలు పరిశీలించి న్యాయం చేయాలని కాంగ్రెస్ పార్టీ పక్షాన కోరుతున్నాం' అని షర్మిల అన్నారు.
ఏపీలో గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షను మార్చి 17న 301 కేంద్రాలలో నిర్వహించారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 81 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందులో డిప్యూటీ కలెక్టర్, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ స్టేట్ ట్యాక్స్, డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (సివిల్), రీజనల్ ట్రాన్స్‌పోర్ట్ ఆఫీసర్, మున్సిపల్ కమిషనర్ (గ్రేడ్–1), అసిస్టెంట్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సూపరింటెండెంట్, డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ జైల్స్ (పురుషులు), డివిజినల్/డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్స్, అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్/అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్, డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్‌మెంట్ ఆఫీసర్, అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ జిల్లా బీసీ సంక్షేమ అధికారి, జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి, కో–ఆపరేటివ్ సర్వీస్ డిప్యూటీ రిజిస్ట్రార్ తదితర పోస్టులున్నాయి.
Also Read : రాఖీ రోజు మీ సిస్టర్స్ కు ఈ గిఫ్ట్స్ ఇవ్వండి.. షాకవుతారు..!