Kishan Reddy: కాశీ కల్చరల్‌ పాత్‌వేకు ఆమోదం

ప్రపంచ వ్యాప్తంగా ఉన్న విభిన్న సాంస్కృతులను కాపాడుకునే దిశగా కాశీ కల్చరల్‌ పాత్‌వేకు ఆమోదం తెలిపినట్లు కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్‌ రెడ్డి తెలిపారు. జీ20 సదస్సులో పాల్గొన్న ఆయన.. పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలివెల్లడించారు.

New Update
Kishan Reddy: కాశీ కల్చరల్‌ పాత్‌వేకు ఆమోదం

ప్రపంచ వ్యాప్తంగా ఉన్న విభిన్న సాంస్కృతులను కాపాడుకునే దిశగా కాశీ కల్చరల్‌ పాత్‌వేకు ఆమోదం తెలిపినట్లు కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్‌ రెడ్డి తెలిపారు. జీ20 సదస్సులో భాగంగా ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయనా.. సాంస్కృతిక ఏకీకరణ ద్వారా సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను చేరుకునే దిశగా ముందుకెళ్తున్నామన్నారు. పర్యావరణ పరిరక్షణ, వాతావరణ మార్పుల నుంచి ప్రపంచాన్ని కాపాడుకునేందుకు సంస్కృతి ప్రోత్సహించడంతోపాటు పలు కీలక అంశాలపై ఈ సమావేశంలో చర్చించినట్లు తెలిపారు.

ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భిన్న సాంస్కృతులను పరిరక్షించుకుంటూ వాటిని ప్రోత్సహించడం ద్వారా ప్రపంచ దేశాలు అన్ని ఏకతాటిపైకి వస్తాయని, సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను నెరవేర్చే దిశగా ముందుకెళ్లాలని జీ20 దేశాలకు కేంద్ర మంత్రి పిలుపునిచ్చారు. భారతదేశంలో భిన్న సాంస్కృతులు ఉన్నాయన్నారు. ఇండియా భిన్నత్వంలో ఏకత్వాన్ని ప్రదర్శిస్తుంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న సాంస్కృతిక వైవిధ్యత అన్ని దేశాలను ఒకేతాటిపైకి తీసుకొచ్చేందుకు, ఒకరినొకరు సాంస్కృతి, సాంప్రదాయాలను గౌరవించుకునేందుకు వీలుగా ఉంటుందన్నారు. మరోవైపు యావత్‌ మానవాళిని ఏకం చేసే విషయంలో సాంస్కృతి కీలక పాత్ర పోషిస్తోందని తెలిపారు. విలువలు, భాషలు, కళలతోపాటు మొదలైనవి దేశాలు, ప్రజల మధ్య సత్సంబంధాలకు బాటలు వేస్తాయని కిషన్ రెడ్డి వెల్లడించారు.

భారత్‌ నేతృత్వంలో జీ20 సమావేశాల్లో భాగంగా జరిగిన మూడు కల్చరల్‌ వర్కింగ్‌ గ్రూప్‌ సమావేశాల్లో గ్లోబల్‌ థిమాలిటిక్ వెబినార్‌లు నిర్వహించామన్న ఆయన.. వెబినార్‌ల్లో కీలకమైన అంశాలపై చర్చ జరిగిందన్నారు. ఈ సమావేశానికి ఒక రోజు ముందు జరిగిన 4వ వర్కింగ్‌ గ్రూప్‌ సమావేశంలోనూ ఈ అంశాలపై మరింత విస్తృతంగా చర్చ జరిగిందని కిషన్‌ రెడ్డి వెల్లడించారు. ఉత్తమ ఫలితాలు సాధించడమే లక్ష్యంగా అంతర్జాతీయ విధానాల రూపకల్పన దిశగా కీలకమైన ముందడుగు వేశామన్నారు. ఈ సమావేశంలో పరస్పర సహకారం ద్వారా ఈ విధానాల అమలు తదితర అంశాలపై సాంస్కృతిక మంత్రుల సమావేశంలో చర్చ జరిగిందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు