G20 summit: ఆయన వస్తారనుకున్నా..కానీ..! జీ20 సమ్మిట్కి జిన్పింగ్ డుమ్మాపై బైడెన్ ఏం అన్నారంటే!
భారత్లో జరగనున్న జీ20 సదస్సుకు చైనా అధ్యక్షుడు జిన్పింగ్ గైర్హాజరు కావడం పట్ల అమెరికా అధ్యక్షుడు బైడెన్ నిరాశ వ్యక్తం చేశారు. బైడెన్ ఒక్క రోజు ముందుగానే ఇండియాలో అడుగుపెట్టనున్నారు. ఈ నెల 9, 10 తేదీల్లో జీ20 సమ్మిట్ జరగనుండగా.. మోదీతో బైడెన్ ఈ నెల 8న భేటీ కానున్నారు. మరోవైపు జిన్పింగ్ డుమ్మా వెనుక అరుణాచల్ ప్రదేశ్ అంశం ముడిపడి ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.