Amrapali : ఆమ్రపాలికి మరో కీలక బాధ్యత.. ఉత్తర్వులు జారీ చేసిన దానకిషోర్‌

తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నీర్ణయం తీసుకుంది. ఐఏఎస్ అధికారి ఆమ్రపాలికి హైదరాబాద్‌ గ్రోత్‌ కారిడార్‌ లిమిటెడ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌, అవుటర్‌ రింగ్‌రోడ్డు ప్రాజెక్టు డైరెక్టర్‌గా అదనపు బాధ్యతలను అప్పగించింది. మెట్రో పాలిటన్‌ కమిషనర్‌ డాక్టర్‌ ఎం.దానకిషోర్‌ అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు.

New Update
Amrapali : ఆమ్రపాలికి మరో కీలక బాధ్యత.. ఉత్తర్వులు జారీ చేసిన దానకిషోర్‌

HGCL MD : తెలంగాణ(Telangana) ప్రభుత్వం మరో కీలక నీర్ణయం తీసుకుంది. ఇటీవల జ‌రిగిన‌ అసెంబ్లీ ఎన్నికల(Assembly Elections) తర్వాత తెలంగాణకు తిరిగివచ్చిన ఐఏఎస్ అధికారి(IAS Officer) ఆమ్రపాలి(Amrapali) కి HMDA కమిషనర్‌గా నియమించిన రేవంత్ సర్కార్ హెచ్‌జీసీఎల్‌ పనులు కూడా తనకే అప్పగించింది.

హెచ్‌జీసీఎల్‌..
ఇప్పటికే హెచ్‌ఎండీఏ ఐటీ, ఎస్టేట్‌ విభాగాలతోపాటు మూసీ రివర్‌ ఫ్రంట్‌ డెలవలప్‌మెంట్‌ ఎండీగా కొనసాగుతున్న ఆమెకు.. హైదరాబాద్‌ గ్రోత్‌ కారిడార్‌ లిమిటెడ్‌(Hyderabad Growth Corridor Limited) (హెచ్‌జీసీఎల్‌) మేనేజింగ్‌ డైరెక్టర్‌, అవుటర్‌ రింగ్‌రోడ్డు ప్రాజెక్టు డైరెక్టర్‌ అదనపు బాధ్యతలను అప్పగించింది. ఈ మేరకు పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి, మెట్రో పాలిటన్‌ కమిషనర్‌ డాక్టర్‌ ఎం.దానకిషోర్‌ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు.

ఇది కూడా చదవండి: JOBS : ఏపీ వైద్యశాఖలో 234 ఉద్యోగాలు.. పరీక్ష లేకుండానే నెలకు లక్ష జీతం

ఎం.దానకిషోర్‌ ప్రకటన..
పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి ఎం.దానకిషోర్‌(M Dana Kishore) హెచ్‌ఎండీఏ కమిషనర్‌గా కూడా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రత్యేకంగా ఈ నెల 6న హెచ్‌ఎండీఏపై పూర్తిస్థాయి సమీక్ష నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే శనివారం హెచ్‌ఎండీఏ కార్యాలయానికి వచ్చిన దానకిషోర్‌ బిజీబిజీగా గడిపిన ఆయన.. వివిధ ప్రాజెక్టుల పురోగతిపై అధికారులతో సమీక్షించారు. అత్యవసరంగా పరిష్కరించాల్సిన దస్త్రాలను కూడా పరిశీలించిన ఆయన ఆ తర్వాత హెచ్‌జీసీఎల్ ఎండీగా ఆమ్రపాలిని నియమిస్తూ అధికారిక ప్రకటన చేశారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు