Sharmila: ప్రధాని మోడీకి లేఖ రాసిన వైఎస్ షర్మిలా.. రాష్ట్రం నిస్సహాయత స్థితిలో ఉందంటూ

ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా ప్రధాని నరేంద్ర మోడీకి మరోసారి లేఖ రాశారు. ఏపీ అభివృద్ధికి సంబంధించి పునర్వ్యవస్థీకరణ చట్టం 2014లో పేర్కొన్న అపరిష్కృత వాగ్దానాలపై ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. ఏపీకి రాజధాని, ప్రత్యేక హోదా అంశాలను ఇందులో పేర్కొన్నారు.

New Update
Sharmila: ప్రధాని మోడీకి లేఖ రాసిన వైఎస్ షర్మిలా.. రాష్ట్రం నిస్సహాయత స్థితిలో ఉందంటూ

AP: ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా (YS Sharmila) భారత ప్రధాని నరేంద్ర మోడీకి (Narendra Modi) మరోసారి లేఖ రాశారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలోని హామీలు అమలు చేయలేదనే అంశాలను ఈ లేఖలో వివరించారు. అలాగే ఏపీ అభివృద్ధికి సంబంధించి పునర్వ్యవస్థీకరణ చట్టం, 2014లో పేర్కొన్న అపరిష్కృత వాగ్దానాలపై ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు.

ఏపీకి రాజధాని లేకుండా చేశారు..
ఈ మేరకు రాష్ట్ర విభజన జరిగిన ఒక దశాబ్దం తర్వాత కూడా ఏపీకి రాజధాని లేకుండా చేశారని ఆమె లేఖలో పేర్కొన్నారు. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి, ఎన్నికల వాగ్దానాలను అమలు పరచలేదన్నారు. పదేళ్లు కావస్తున్నా నేటికీ ఒక్క హామీ కూడా నెరవేరలేదని, విభజన జరిగిన దశాబ్దం తర్వాత కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలు మోసపోయారనేది వాస్తవమన్నారు. నేడు రాష్ట్రం గందరగోళం, నిస్సహాయత స్థితిలో ఉందని వెల్లడించారు.

రాష్ట్రానికి జీవనాడి..
అలాగే 'ప్రత్యేక హోదా అనేది వివిధ రంగాల్లో రాష్ట్ర ప్రమాణాలను మెరుగుపరచడం, తద్వారా ఇతర రాష్ట్రాలకు పోటీగా రాష్ట్రం అభివృద్ధి సాధించే అవకాశం ఉండేది. ఇది జరగలేదు. ప్రభుత్వం ఈ డిమాండ్ ను పూర్తిగా విస్మరించింది. రాష్ట్రానికి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టులో అత్యంత కీలకమైన వాగ్దానాలు చాలా ఉన్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ప్రాజెక్టు జాతీయ హోదాను నీరుగార్చేశాయి. ఫలితంగా నేడు పోలవరం ప్రాజెక్టు భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది' అని ఆమె తెలిపారు.

ఇది కూడా చదవండి : Lavanya: సంగీతం టీచర్‌ డ్రగ్స్ దందా.. వీఐపీలతోనే సంబంధాలు

ప్రత్యేక హోదా..
ప్రత్యేక హోదా ఇస్తానని ఆనాటి ప్రధాని చెప్పారని, ఇందుకు ఒక స్పష్టమైన ఉదాహరణ ఉందన్నారు. కానీ ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం ఈ డిమాండ్‌ను పూర్తిగా విస్మరించిందన్నారు. ప్రభుత్వాలుకూడా ప్రాజెక్టు వ్యయాన్ని తగ్గించడానికి ప్రయత్నాలు చేస్తున్నాయని తెలుస్తోంది. ఇదేజరిగితే ప్రాజెక్టు లక్ష్యాన్ని నాశనం చేసినట్లేనని ప్రధానికి రాసిన లేఖలో షర్మిల పేర్కొన్నారు. పర్యవసానంగా నేడు, AP పురోగతి, అభివృద్ధి లేకుండా పోయిందని వివరించారు. పోలవరం రాష్ట్ర ప్రజల హక్కు అని.. ఈ రోజు ప్రాజెక్ట్ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా ఉందన్నారు. ఈ అంశాలను 5.5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజల తరపున తాము విజ్ఞప్తిని చేస్తున్నామని తెలిపారు. ఈ విషయాన్ని సీరియస్‌గా పరిగణించి ఈ వాగ్దానాలను నెరవేర్చాలని షర్మిల లేఖలో డిమాండ్ చేశారు. సుదీర్ఘ పోరాటం ఫలితంగా ఉక్కు కర్మాగారం ఏర్పడింది, దానికోసం అనేక మంది ప్రాణాలు అర్పించారు. మీరు ఈ విషయాన్ని సీరియస్‌గా పరిగణించి, ఈ వాగ్దానాలను నెరవేర్చడానికి, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఆశాజనకంగా, పురోగతిని అందించడానికి ఖచ్చితమైన చర్యలను ప్రారంభిస్తారని ఆశిస్తున్నామని ప్రధానికి రాసిన లేఖలో షర్మిల పేర్కొన్నారు.

భద్రత పెంచాలి..
ఇటీవలే వైఎస్ఆర్ టీపీ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసిన షర్మిలా తదనంతరం పీసీసీ బాధ్యతలు చేపట్టింది. దీంతో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మరింత రసవత్తరంగా సాగుతున్నాయి. ఈ క్రమంలోనే మంగళవారం మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ.. జగన్‌కు తల్లి, చెల్లి, బాబాయ్‌ అనే తేడా లేదన్నారు. 'జగన్ కు నేనో లెక్కా. షర్మిలను అంతమొందించినా ఆశ్చర్య పడక్కర్లేదు. ఆమెకు భద్రత పెంచాలి. రాజశేఖర్‌రెడ్డి ఆస్తిలో షర్మిలకు వాటా రాశారు. అది జగన్‌ ఇవ్వడం లేదు' అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు