AP TET: ఏపీ టెట్ నోటిఫికేషన్ విడుదల ఏపీలో టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TET) నోటిఫికేషన్ విడుదలైంది. మెగా డీఎస్సీ ద్వారా 16,347 టీచర్ పోస్టులను భర్తీ చేయనున్న నేపథ్యంలో ఈ టెట్ ఎగ్జామ్ నిర్వహించనున్నారు. అప్లికేషన్ లింక్ ఇదే https://aptet.apcfss.in/ By srinivas 01 Jul 2024 in ఆంధ్రప్రదేశ్ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి AP TET Notification 2024: ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం టీచర్ అభ్యర్థులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఇచ్చిన మాట ప్రకారమే టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TET) నోటిఫికేషన్ విడుదల చేసింది. మెగా డీఎస్సీ ద్వారా 16,347 టీచర్ పోస్టులను భర్తీ చేయనుండగా.. అభ్యర్థులు ఆన్ లైన్ వేదికగా టెట్ ఎగ్జామ్ కు అప్లై చేసుకోవాలని సూచించింది. లింక్ ఇదే https://aptet.apcfss.in/ డిసెంబర్ 10లోగా మెగా డీఎస్సీ.. ఇక రాష్ట్రంలో వివిధ కేటగిరీల కింద 16,347 టీచర్ పోస్టుల భర్తీ కోసం ప్రభుత్వం మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలకు ప్రణాళికలు సిద్ధం చేసింది. కేబినెట్ ఆమోదం కూడా లభించడంతో త్వరలోనే ఇది విడుదల చేయనుంది. ఆలోపు మెగా డీఎస్సీకి అర్హత అయిన టెట్ పరీక్షను మరోసారి నిర్వహించడం ద్వారా ఇంకా ఎవరైనా రాయాలనుకుంటే రాసే వీలును ప్రభుత్వం కల్పించింది. ఎట్టి పరిస్ధితుల్లోనూ డిసెంబర్ 10లోగా మెగా డీఎస్సీ ప్రక్రియ పూర్తి చేస్తామని ప్రభుత్వం తెలిపింది. అలాగే ప్రతీ జిల్లాలో 80 శాతం పోస్టుల్ని స్థానికులకు ఇచ్చేలా, మరో 20 శాతం నాన్ లోకల్ అభ్యర్ధులకు కేటాయించేలా ఈసారి నోటిఫికేషన్ ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల డీఎస్సీ రద్దు.. ఇదిలా ఉంటే.. ఏపీలో గత ప్రభుత్వం ఇచ్చిన ఎన్నికల డీఎస్సీ ప్రకటనను టీడీపీ సర్కారు రద్దు చేసింది. వైసీపీ ప్రభుత్వం విడుదల చేసిన 6,100 టీచర్ పోస్టుల నోటిఫికేషన్ క్యాన్సిల్ చేస్తున్నట్లు విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. జులై 1న మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల కానున్న నేపథ్యంలో వైసీపీ ప్రకటించిన 6,100 టీచర్ పోస్టుల నోటిఫికేషన్ రద్దు చేస్తూ.. మరిన్ని పోస్టులు పెంచి 16,347లతో మెగా డీఎస్సీని ప్రకటించింది. ఫిబ్రవరి, మార్చి నెలల్లో జరిగిన టెట్ పరీక్షలో అర్హత సాధించని వారు ఈ టెట్ ప్రకటన తర్వాత బీఈడీ, డీఈడీ కోర్సు పూర్తి చేసిన విద్యార్థులు ఉన్నందున మెగా డీఎస్సీతోపాటు టెట్ కూడా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. #ap-tet #notification-release #ap-tet-notification మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి