AP TET Hall Ticket 2024: డీఎస్సీ, టెట్ పరీక్షల కోసం ఎదురుచూస్తున్న ఏపీ విద్యార్థులకు గుడ్ న్యూస్. ఏపీ టెట్ హాల్ టికెట్లు (AP TET Hall Tickets) రిలీజ్ అయ్యాయి. ఫిబ్రవరి 23నుంచి తేదీ నుంచి టెట్ హాల్ టికెట్లు అందుబాటులో ఉంచనున్నట్లు అధికారులు తెలిపారు.
ఫిబ్రవరి 27 నుంచి మార్చి 9వరకూ పరీక్షలు..
ఈ మేరకు ఏపీ విద్యాశాఖ ఇటీవలే టెట్ నోటిఫికేషన్ విడుదలచేయగా ఫిబ్రవరి 8 నుంచి 18 వరకూ టెట్ దరఖాస్తుల ప్రక్రియ ముగిసింది. అయితే ఈ పరీక్షలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఫిబ్రవరి 27 నుంచి మార్చి 9వ తేదీ పరీక్షలు నిర్వహించనున్నారు. డీఎస్సీలో టెట్ మార్కులకు 20 శాతం వెయిటేజీ ఇస్తారు.
ఇది కూడా చదవండి : Kerala: బాలికపై 80 ఏళ్ల వృద్ధుడు అత్యాచారం.. సంచలన తీర్పు ఇచ్చిన కోర్టు!
మార్చి 14న టెట్ ఫలితాలు..
ఫిబ్రవరి 27 నుంచి మార్చి 9 వరకు రెండు సెషన్స్‌లో టెట్ ఎగ్జామ్స్ నిర్వహించనున్నారు. మార్చి 10న టెట్ కీ (TET Key) రిలజ్ చేస్తారు. ఈ కీ పై అభ్యంతరాలుంటే మార్చి 11వ వరకు ఫిర్యాదులు చేసుకునే అవకాశం కల్పించారు. టెట్ ఫైనల్ కీ మార్చి 13న విడుదల చేస్తారు. మార్చి 14న టెట్ ఫలితాలు రిలీజ్ అవుతాయి. ఏపీ టెట్, ఏపీ డీఎస్సీ ఎగ్జామ్స్ పూర్తిగా కంప్యూటర్ ఆధారంగా నిర్వహించబోతున్నట్లు విద్యా శాఖ అధికారులు వెల్లడించారు.
టెట్ హాల్ టికెట్లను అభ్యర్థులు ఈ వెబ్‌సైట్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చు. https://aptet.apcfss.in/