TDP New Committee: టీడీపీ పొలిటికల్ యాక్షన్ కమిటీ.. బాలకృష్ణ, లోకేష్ తో పాటు మరో 12 మందికి చోటు.. లిస్ట్ ఇదే! చంద్రబాబు నాయుడు ఆదేశాలతో టీడీపీ రాజకీయ కార్యక్రమాల పర్యవేక్షణకు పొలిటికల్ యాక్షన్ కమిటీని నియమించినట్లు ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ప్రకటించారు. కమిటీలో నారా లోకేష్, నందమూరి బాలకృష్ణతో పాటు యనమల రామకృష్ణుడు, అచ్చెన్నాయుడు, అయ్యన్నపాత్రుడు, పయ్యావుల కేషవ్, నిమ్మల రామానాయుడు, బీద రవిచంద్రయాదవ్ తో పాటు మరో 9 మందికి అవకాశం కల్పించారు. By Nikhil 24 Sep 2023 in ఆంధ్రప్రదేశ్ విజయవాడ New Update షేర్ చేయండి స్కిల్ డవలప్మెంట్ కేసులో టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయిన విషయం తెలిపిందే. చంద్రబాబు కుమారుడు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ సైతం త్వరలో అరెస్ట్ అయ్యే అవకాశం ఉందన్న ప్రచారం సైతం పొలిటికల్ సర్కిల్స్ లో జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో టీడీపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు కింజారపు అచ్చెన్నాయుడు కీలక ప్రకటన చేశారు. చంద్రబాబు నాయుడు ఆదేశాలతో టీడీపీ రాజకీయ కార్యక్రమాల పర్యవేక్షణకు పొలిటికల్ యాక్షన్ కమిటీని నియమించినట్లు ప్రకటించారు. మొత్తం 14 మంది సభ్యులతో ఈ కమిటీని ఏర్పాటు చేశారు. కమిటీలో నారా లోకేష్, నందమూరి బాలకృష్ణతో పాటు యనమల రామకృష్ణుడు, అచ్చెన్నాయుడు, అయ్యన్నపాత్రుడు, పయ్యావుల కేశవ్, నిమ్మల రామానాయుడు, బీద రవిచంద్రయాదవ్ తో పాటు మరో 6 మందికి అవకాశం కల్పించారు. రానున్న ఎన్నికల ప్రచారంలో ఈ కమిటీ కీలకంగా వ్యవహరించనుంది. కమిటీలో బాలయ్యకు చోటు కల్పించడంతో ఇక నుంచి ఆయన టీడీపీ కార్యక్రమాల్లో కీలక పాత్ర పోషించనున్నట్లు తెలుస్తోంది. కమిటీలోని సభ్యులు 1. యనమల రామకృష్ణుడు 2. కింజరాపు అచ్చెన్నాయుడు 3. చింతకాయల అయ్యన్నపాత్రుడు 4. ఎం.ఏ.షరీఫ్ 5. పయ్యావుల కేశవ్ 6. నందమూరి బాలకృష్ణ 7. నిమ్మల రామానాయుడు 8. నక్కా ఆనందబాబు 9. కాలువ శ్రీనివాసులు 10. కొల్లు రవీంద్ర 11. బీసీ జనార్ధనరెడ్డి 12. వంగలపూడి అనిత 13. బీద రవిచంద్రయాదవ్ 14. నారా లోకేష్ ఇది కూడా చదవండి: Nara Lokesh Yuvagalam: యువగళం యాత్రపై నారా లోకేష్ సంచలన నిర్ణయం.. ముఖ్య నేతలతో టెలికాన్ఫరెన్స్ #nara-lokesh #tdp #balakrishna #chandrababu-arrest #acham-naidu మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి