AP : వైసీపీ రౌడీ మూకలపై చర్యలు తీసుకోండి.. గవర్నర్ ను కలిసిన టీడీపీ నేతలు!

ఏపీలో జరుగుతున్న అల్లర్లకు వైసీపీ రౌడీ మూకలే కారణమని, వెంటనే వారిపై చర్యలు తీసుకోవాలంటూ గవర్నర్ ను కలిశారు టీడీపీ నేతలు. శాంతిభద్రతలను పరిరక్షించడంలో పోలీసులు విఫలమయ్యారని ఫిర్యాదులో పేర్కొన్నారు. టీడీపీ గెలవబోతుందనే కోపంతో వైసీపీ ఈ దుర్మార్గానికి పాల్పడిందన్నారు.

AP : వైసీపీ రౌడీ మూకలపై చర్యలు తీసుకోండి.. గవర్నర్ ను కలిసిన టీడీపీ నేతలు!
New Update

TDP Leaders Met The Governor : పల్నాడు, మాచర్ల, తాడిపత్రిలో జరుగుతున్న హింసాత్మక ఘటనలపై చర్యలు తీసుకోవాలంటూ గవర్నర్ ను కలిశారు టీడీపీ నేతలు. అలాగే శాంతిభద్రతలను పరిరక్షించడంలో పోలీసులు విఫలమయ్యారని, ఎన్నికల(Elections) ముందు, ఎన్నికల అనంతరం శాంతిభద్రతలను పరిరక్షించడంలో పోలీసులు విఫలలో పేర్కొన్నారు.

ఈ మేరకు అరాచక ప్రభుత్వాన్ని సాగనంపేందుకు దేశ విదేశాల నుంచి ఓటర్లు(Voters) స్వచ్ఛంధంగా తరలి వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారని చెప్పారు. ఇవన్నీ చూసి తట్టుకోలేక వైసీపీ నేతలు(YCP Leaders) పోలింగ్ బూత్ ల వద్ద గొడవలకు దిగారు. కవ్వింపు చర్యలు, రెచ్చగొట్టే కార్యక్రమాలు, ఓట్లు వేసేందుకు వస్తున్న ఓటర్లను ప్రలోభాలకు గురి చేసే ప్రయత్నాలు చేశారు. పల్నాడులో వైసీపీ రౌడీ మూకలు హింసాత్మక చర్యలకు పాల్పడ్డారు. పోలింగ్ బూత్ ల దగ్గర పోలీస్ బందోబస్తు లేకుండా చేసి టీడీపీ కార్యకర్తలపై దాడులకు తెగబడ్డారు. కొన్నిచోట్ల పోలింగ్ బూత్ లను స్వాధీనం చేసుకునే ప్రయత్నాలు చేశారని కంప్లైట్ చేశారు.

గవర్నర్ ను కలిసిన వారిలో టీడీపీ పొలిట్ బ్యూరో(TDP Polit Beurre) మెంబర్ కొల్లు రవీంద్ర, మాజీ మంత్రి దేవినేని ఉమ, వర్ల రామయ్య, నక్క ఆనంద్ బాబు, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, జంగా కృష్ణమూర్తి, బిజెపి దినకర్ జనసేన చల్లపల్లి శ్రీనివాస్ తదితరులు కొల్లు రవీంద్రలు ఉన్నారు.

Also Read : తిరుమలలో మరోసారి చిరుత కలకలం

#ycp #tdp-leaders #ap-governor #ap-voters
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe