గుంటూరులో డెల్టా ఆయకట్టు రైతాంగానికి సాగునీరు అందించాలంటూ టీడీపీ నేతలు ఆందోళన చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు నక్కా ఆనందబాబు, ఆలపాటి రాజేంద్రప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి నక్కా ఆనందబాబు మాట్లాడుతూ.. కృష్ణ డెల్టా రైతాంగం నారుమళ్లు అయిపోయి నీరు కోసం ఎదురుచూడటం దారుణమన్నారు. ఏ నీరు ఎప్పుడు వాడాలో కూడా కనీస పరిజ్ఞానం లేని ప్రభుత్వం రాష్ట్రంలో ఉందని ఫైర్ అయ్యారు. ఏదన్నా సమస్యపై మంత్రులు మాట్లాడమంటే బూతులు తప్ప ఏమి మాట్లాడారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో 5 లక్షల70వేల ఎకరాలు సాగులోకి ఉన్నాయన్నారు. ఇరిగేషన్ కోసం ఏమి చేశారు..? అంటే మీనమేషాలు లెక్కిస్తున్న పరిస్థితి ఉందని ధ్వజమెత్తారు. వైసీపీ నాయకులు ఇళ్ల వెంట తిరగటం కాదు రైతు దగ్గరకు పొలాల వెంట తిరగాలని నక్కా ఆనందబాబు డిమాండ్ చేశారు.
నీళ్లు ఇష్టానుసారంగా వాడేసి
వైసీపీ ప్రభుత్వం వచ్చాక నలుగు ఏళ్లు పట్టిసీమకు తాళం వేశారని ఫైర్ అయ్యారు. నీళ్లు ఇష్టానుసారంగా వాడేసి ఇప్పుడు నీళ్లు కోసం ఏమి చెయ్యాలి తెలియని పరిస్థితిలో జగన్ ప్రభుత్వం ఉందని ఆరోపించారు.నీటి విషయంలో జగన్ ప్రభుత్వం చేతులు ఎత్తేసిన పరిస్థితి ఉందని జోస్యం చెప్పారు. కృష్ణా జలాలపై ఆంధ్రప్రదేశ్ హక్కులు కోల్పోయే పరిస్థితి జగన్ తెచ్చారని విమర్శించారు. జగన్ ప్రభుత్వం చర్యల వల్ల రాబోయే రోజుల్లో డెల్టా ప్రాంతానికి తీవ్ర నష్టం వాటిల్లుతుందన్నారు. రైతాంగన్నీ నాశనం చేసే విధంగా జగన్ పాలన ఉన్నదన్నారు. రెండు రోజులు సమయం ఇస్తున్నాము డెల్టా రైతాంగానికి నీరు ఇవ్వాలి లేని పరిస్థితుల్లో అధికారులు ఉద్యోగం ఎలా చేస్తారో చూస్తాము సవాల్ చేశారు.
వైసీపీ నాయకులు వాటాలు పంచుకుంటున్నారు
మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ.. వ్యవసాయం అంటే పూర్తిగా అవగాహన లేని పాలన జగన్ పాలనలో చూస్తున్నామన్నారు. ఒక్క ఎకరానికి కూడా సరిగ్గా నీరు పెట్టుకొలేన పరిస్థితిల్లో రైతాంగం ఉందన్నారు. ప్రభుత్వం వ్యవసాయం పట్ల గానీ, రైతుల పట్ల గానీ ఒక్క చర్చ అన్న పెట్టరా..? అని ప్రశ్నించారు. జగన్ పాలనలో రైతాంగం పూర్తిగా నాశనం అవుతున్న పరిస్థితి ఉందన్నారు. రైతుల విషయంలో ఏదో ఒక రకంగా కాలయాపన వైసీపీ ప్రభుత్వం చేస్తుందని మండిపడ్డారు. కాల్వలు బాగుచెయ్యకుండ బాగు చేసుకున్నట్టు వైసీపీ నాయకులు వాటాలు పంచుకుంటున్నారని ఫైర్ అయ్యారు. కృష్ణా నీరు హక్కులను పూర్తిగా కాలరాస్తున్న పరిస్థితి ఉందన్నారు. ఢిల్లీ వెళ్లి మోదీ నుంచి కేంద్ర మంత్రుల వరకు అందరినీ కలిసి వచ్చి కృష్ణా జలాల విషయం అక్కడ చెప్పకుండా ఇక్కడికి వచ్చి లెటర్ రాస్తున్నాను అని చెబుతున్నారని ఆలపాటి రాజేంద్రప్రసాద్ ఆరోపించారు.
ఇది కూడా చదవండి: తెలంగాణలో రానుంది బీజేపీ ప్రభుత్వమే.. కేంద్ర మంత్రి బీఎల్ శర్మ