AP News: ఏపీలోని 12 లక్షల మంది విద్యార్థులకు జగన్ సర్కార్ అదిరిపోయే శుభవార్త..!!

ప్రముఖ ఈ లెర్నింగ్ కోర్సుల సంస్థ ఎడెక్స్ తో ఏపీ సర్కార్ నేడు ఒప్పందం కుదుర్చుకుంది. రాష్ట్రంలో 12లక్షల మంది విద్యార్థులకు 2వేలకు పైగా కోర్సులను ఆన్ లైన్లో అందించే వీలుగా సీఎం జగన్ సమక్షంలో ఈ ఒప్పందం కుదిరింది.

New Update
AP News: ఏపీలోని 12 లక్షల మంది విద్యార్థులకు జగన్ సర్కార్ అదిరిపోయే శుభవార్త..!!

AP News:  ప్రముఖ ఈ లెర్నింగ్ కోర్సుల సంస్థ ఎడెక్స్ తో ఏపీ సర్కార్ నేడు ఒప్పందం కుదుర్చుకుంది. రాష్ట్రంలో 12లక్షల మంది విద్యార్థులకు 2వేలకు పైగా కోర్సులను ఆన్ లైన్లో అందించే వీలుగా సీఎం జగన్ సమక్షంలో ఈ ఒప్పందం కుదిరింది. దాదాపు 26 యునివర్సిటీలకుసంబంధించిన వీసీలు, విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఏపీ చరిత్రలో ఇదో సువర్ణాధ్యాయమని సీఎం జగన్ అన్నారు.

విద్యాహక్కు పాత నినాదమని...నాణ్యమైన విద్యా హక్కు కొత్త నినాదమని సీఎం జగన్ ఎడెక్స్ తో ఒప్పందం కుదుర్చుకున్న సందర్భంగా వెల్లడించారు. రాష్ట్రంలో పిల్లలు చుట్టుపక్కల రాష్ట్రాలు, ఈ దేశంలో విద్యార్థులతో కాదని ప్రపంచంతో అన్నారు. పిల్లలు మెరుగైన ఉద్యోగాలు సంపాదించాలంటే పెద్ద జీతాలతో ఉద్యోగాలు రావాలంటే విద్యలో అంతర్జాతీయ ప్రమాణాలు అవసరమన్నారు. ఉన్నత విద్యలో రాష్ట్ర సర్కార్ వేస్తున్న అడుగులు ఫలాలు ఇవ్వాలంటే నాలుగు లేదా ఐదేళ్లు పట్టవచ్చన్నారు.

ఎడెక్స్ ఒప్పందంతో దాదాపు రెండువేలకు పైగా కోర్సులు పాఠ్య ప్రణాళికతో వర్టికల్స్ కింద పిల్లలకు అందుబాటులోకి వస్తాయని జగన్ తెలిపారు. వరల్డ్ ఫేమస్ కాలేజీలు ఎంఐటీ, ఎల్ఎస్ఈ , హార్వర్డ్ ఇంకా ప్రఖ్యాత కాలేజీల కోర్సులు దీని ద్వారా నేర్చుకోవచ్చన్నారు. వాళ్లు కోర్సులు ఆఫర్ చేసి బోధిస్తారని..పిల్లలు ఆన్ లైన్లో వాళ్లతో ఇంటరాక్ట్ అయి వారి డౌట్స్ క్లారిఫికేషన్ చేస్తారన్నారు. ఫైనల్ గా పరీక్షలు ఉంటాయని అన్నారు. పిల్లలు ఆ పరీక్షల్లో పాస్ అయితే క్రెడిట్స్ వారి పాఠ్య ప్రణాళికలో భాగం అవుతారు.

రాష్ట్రంలో యూనివర్సిటీలలో అందుబాటులో లేని కోర్సులు కూడా ఎడెక్స్ లో నేర్చుకునే అవకాశం ఉంటుందని సీఎం జగన్ అన్నారు. ఆర్టిఫీఫియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, డేటా సైన్సెస్, రియల్ ఎస్టేట్ మేనేజ్ మెంట్ సైబర్ ఫోరెన్సిక్, డిగ్రీలో భాగంగా అందుబాటులో ఉంటాయన్నారు. ఇవేవీ మనదేశంలో ఉండవన్నారు.

ఈ కార్యక్రమంలో విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, సీఎస్‌ డాక్టర్‌ కె ఎస్‌ జవహర్‌రెడ్డి, ఏపీ ఉన్నత విద్యామండలి చైర్మన్‌ కె హేమచంద్రారెడ్డి, ఉన్నత విద్యాశాఖ స్పెషల్‌ సీఎస్‌ బుడితి రాజశేఖర్, విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాష్, కాలేజీ ఎడ్యుకేషన్‌ కమిషనర్‌ పోలా భాస్కర్, ప్రాధమిక విద్యాశాఖ కమిషనర్‌(మౌలిక వసతుల కల్పన) కాటమనేని భాస్కర్, ఎడెక్స్‌ వ్యవస్ధాపకులు ప్రొఫెసర్‌ అనంత అగర్వాల్, ఎడెక్స్‌ ఇతర ప్రతినిధులు, విద్యార్ధులు హాజరయ్యారు.

ఇది కూడా చదవండి: పండగలాంటి వార్త..భారీగా తగ్గిన ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ ధర..కొత్త ధరలు తెలుస్తే కొనేస్తరు..!!

Advertisment
Advertisment
తాజా కథనాలు