RP Sisodia: ఏపీ రెవెన్యూ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సంచలన వ్యాఖ్యలు చేశారు. బుడమేరు వరద విషయంలో ఆర్పీ సిసోడియా వ్యాఖ్యలు చేశారు. వరద వస్తుందని తమకు ముందే తెలుసు అని అన్నారు. మేము అలర్ట్‌గానే ఉన్నాం, కానీ వారికి చెప్పలేదని చెప్పారు. 2 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించడం అసాధ్యం అని అన్నారు. గోదావరి జిల్లాల్లో వరద వస్తుందని చెబితే మాకు తెలుసులే అని అంటారని అన్నారు.
ఇలాంటివి ఎన్నో చూశామని అంటారు, అలాంటి సమస్య బుడమేరు దగ్గర తలెత్తిందని పేర్కొన్నారు. ప్రజలు వెళ్లరని మేము చెప్పలేదని అన్నారు. బుడమేరుకు గండ్లు పడతాయని తెలుసు.. అందుకే అప్రమత్తంగా ఉన్నాం అని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం సిసోడియా చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో దుమారం లేపుతున్నాయి.