AP Polls : ఏపీలో 21.75 లక్షల ఇళ్ల నిర్మాణం.. మంత్రి జోగి రమేష్ కీలక ప్రకటన! ఏపీలో 21.75 లక్షల ఇళ్ల నిర్మాణం జరుగుతుందని మంత్రి జోగి రమేష్ అన్నారు. పవన్‌కు ఏపీలో ఆధార్ కార్డు లేదు, ఓటు లేదు. చంద్రబాబు తాబేదారుగా పవన్ పనిచేస్తున్నారని మండిపడ్డారు. By V.J Reddy 31 Dec 2023 in ఆంధ్రప్రదేశ్ గుంటూరు New Update షేర్ చేయండి Minister Jogi Ramesh : టీడీపీ అధినేత చంద్రబాబు(Chandrababu), జనసేన ఛీఫ్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) పై నిప్పులు చెరిగారు మంత్రి జోగి రమేష్. చంద్రబాబు తాబేదారుడు పవన్ కళ్యాణ్ అని అన్నారు. పవన్ కళ్యాణ్ కి బుర్ర,బుద్ధి లేదంటూ ఫైర్ అయ్యారు. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులు చూసి ప్రజల నుంచి వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక పవన్, చంద్రబాబు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. ALSO READ: తస్మాత్ జాగ్రత్త.. దొరికితే రూ.10,000ఫైన్, 6 నెలలు జైలు శిక్ష మంత్రి జోగి రమేష్(Jogi Ramesh) ఈ రోజు మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వంలో 30లక్షల 65 వేల ఇళ్ల స్థలాలు సక్రమంగా అక్క చెల్లమలకు ఇచ్చామని అన్నారు. 13 అంశాలుపై పూర్తి వివరాలతో పవన్ కళ్యాణ్ కి పంపిస్తున్నాం అని అన్నారు. పవన్ కళ్యాణ్ కు ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) లో ఇల్లు ఉందా, ఆధార్ కార్డ్ ఉందా, డోర్ నెంబర్ ఉందా, కనీసం ఓటు ఉందా? అని ప్రశ్నించారు. చంద్రబాబు తాబేదారుడు పవన్ కళ్యాణ్ అని చురకలు అంటించారు. చంద్రబాబు పైసలు కోసం ఏ గడ్డి ఆయన తినడానికి సిద్ధంగా వున్నాడని విమర్శించారు. ఎక్కడ జరగని విధంగా అభివృద్ధి, సంక్షేమం ఏపీలో జరుగుతుందని అన్నారు. సొంత ఇల్లు లేకుండా అడ్రెస్ లేని పేద వారికి అడ్రెస్ ఇచ్చారు జగన్ అని కొనియాడారు. 21 లక్షలు 75 వేల మందికి ఒక్క యజ్ఞంలాగా ఇల్లు నిర్మణాలు సాగుతున్నాయని తెలిపారు. చాలా మంది గృహ ప్రవేశాలు చేసుకొని పిల్ల పాపాలతో జయహో జగనన్న అంటున్నారని అన్నారు. పవన్ కళ్యాణ్ కి బుర్ర,బుద్ధి లేదు అంటూ వ్యాఖ్యానించారు. స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ లోని ప్యాకేజీపై ప్రధానికి తాము కూడా లేఖ రాస్తామని అన్నారు. చంద్రబాబు హయాంలో ఇల్లు స్థలం ఇవ్వలేని దద్దమ్మలు అని మండిపడ్డారు. ఇంత మంచి పనులు చేస్తున్న జగన్ కు పవన్ కళ్యాణ్ సెల్యూట్ కొట్టాలి కానీ.. లెటర్ రాయడం ఏంటి? అని ఫైర్ అయ్యారు. ALSO READ: త్వరలోనే మెగా డీఎస్సీ.. సీఎం రేవంత్ ఆదేశాలు కుప్పంకి మంచి నీళ్ళు ఇవ్వని చంద్రబాబు ఎయిర్ పోర్ట్ కడుత అంటున్నాడు అని ఎద్దేవా చేశారు. పవన్ కు ఛాలెంజ్.. 13 అంశాలపై జనసేన పార్టీ చర్చకు సిద్ధమా? అని ప్రశ్నించారు. భారత దేశ చరిత్ర ఎక్కడ జరుగుతుంది ఇంత సంక్షేమం, అభివృద్ధి.. ప్రతి ఇంట్లో ప్రతి గ్రామంలో ఆర్థిక అభివృద్ధి పొందుతున్నారు అని అన్నారు. ప్రధానికి లేఖలు చంద్రబాబు మీద, ఆయన కొడుకు మీద పవన్ కళ్యాణ్ రాయాలి అని అన్నారు. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ పై ప్రధానికి లెటర్ రాయాలి అన్నారు. చంద్రబాబు పవన్ తోడు దొంగలు అని పేర్కొన్నారు. 14 సంవత్సరాల్లో అధికారంలో ఉండి ఏం చేయని చంద్రబాబు ఇప్పుడు బస్ ఎక్కిస్తాం.. అది చేస్తాం.. ఇది చేస్తాం.. అంటే ఎలా నమ్ముతారు అని అన్నారు. 2024లో అధికారంలోకి వచ్చేది వైసీపీ అని దోమ వ్యక్తం చేశారు. #pawan-kalyan #ap-news #cm-jagan #minister-jogi-ramesh #tdp-chandrababu #free-houses-ap సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి