ఏపీలో ఎన్నికలు (Ap Elections) సమీపిస్తున్న తరుణంలో అటు అధికార పక్షంలో, ప్రతిపక్షాల్లో ఫుల్ టెన్షన్ మొదలైనట్లు కనిపిస్తోంది. ఇప్పటికే అధికారం పక్షం వారు గడపగడపకి, సాధికారిక బస్సు యాత్రలు అంటూ ఓటర్లను ఆకట్టుకోవడానికి రకరకాల యాత్రలు చేపట్టింది. ఈ క్రమంలోనే కోనసీమ జిల్లా వైసీపీలో రాజకీయాలు ఉత్కంఠగా మారాయి.
తమ అభిమాన నాయకుడికి టిక్కెట్ ఇస్తారా ఇవ్వారా అంటూ స్థానిక వైసీపీ నేతల్లో ఫుల్ టెన్షన్ ఏర్పడింది. ఈ క్రమంలోనే నేడు పి.గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు ను సీఎం కలవనున్నట్లు అధికారులు తెలిపారు. ఇప్పటికే టికెట్ లేదని ప్రచారం జరగడంతో అమరావతి వెళ్లి మిథున్ రెడ్డితో సమావేశం అయిన ఎమ్మెల్యే చిట్టిబాబు అనుచరులు.
ఈ క్రమంలోనే మంత్రి పినిపే విశ్వరూప్ సోమవారం జరగాల్సిన కార్యక్రమాలన్నిటిని కూడా వాయిదా వేసుకొని హైదరాబాద్ వెళ్లి అక్కడ నుంచి మంతనాలు జరుపుతున్నారని తెలుస్తోంది. ఎమ్మెల్యే టికెట్ పై కొంతమంది అమరావతిలో మకాం వేసి ఈసారి అవకాశం ఇవ్వాలంటూ ప్రయత్నాలు చేస్తున్నారు.
తనకు కాకపోయినా తన కుమారుడు శ్రీకాంత్ కు అమలాపురం టిక్కెట్ ఇవ్వాలని మంత్రి విశ్వరూప్ అడుగుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పి. గన్నవరం నుంచి ఎంపీ చింతా అనురాధ, జడ్పీ ఛైర్మన్ విప్పర్తి వేణుగోపాల్, గన్నవరు శ్రీనివాస్ లు టికెట్ కోసం పట్టుపడుతున్నట్లు సమాచారం. వైసీపీ జిల్లా అధ్యక్షుడు సైతం అందుబాటులో లేకుండా తిరుపతిలో ఉన్న ఎమ్మెల్యే పొన్నాడ సతీష్.
Also read: పులివెందుల కోర్టుకు చేరుకున్న సీబీఐ అధికారులు..ఎందుకంటే!