Andhra Pradesh : సీఎం జగన్‌పై దాడి కేసులో కీలక పరిణామం..పోలీసుల అదుపులో నలుగురు నిందితులు ఏపీ సీఎం జగన్ మీద జరిగిన దాడి కేసులో కీలక పరిణామాలు జరిగాయి. ఈ దాడికి సంబంధించి నలుగురు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిని విజయవాడలో విచారిస్తున్నారు. By Manogna alamuru 15 Apr 2024 in ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు New Update షేర్ చేయండి Attack On CM Jagan : ప్రస్తుతం ఆంధ్రాలో హాట్ టాపిక్ సీఎం జగన్(CM Jagan) దాడి. దీని అధికార, విపక్షాలు రెండూ తెగ మాట్లాడుతున్నాయి. ప్రచారంలో ఉన్న ముఖ్యమంత్రి మీద దాడి జరగడంతో ఈ మ్యాటర్‌ను పోలీసులు కూడా సీరియస్‌గా తీసుకున్నారు. దీనికి సంబంధించి కీలక ప్రగతిని కూడా సాధించారు. జగన్ మీద దాడి చేసిన వారిని నలుగురిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. వీరిని విజయవాడ(Vijayawada) లో విచారిస్తున్నారు. దాడి ఎలా జరిగింది? కారణం ఏంటన్న కోణంలో విచారణ కొనసాగుతోంది. ఎయిర్ గన్‌తో దాడి చేశారా లేదంటే... క్యాట్‌బాల్‌తో కొట్టారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. దాంతో పాటూ గంగానమ్మ గుడి దగ్గర సెల్ టవర్ పరిధిలో కాల్స్‌పై నిఘా కూడా పెట్టారు పోలీసులు. స్కూల్‌కి, గుడికి మధ్య ఖాళీ ప్రదేశం నుంచి దాడి జరిగినట్టుగా ప్రాథమిక నిర్ధారణలో తేలింది. ఈ కేసు విషయమై పోలీసులు ఇప్పటి వరకు 40 మందికిపైగా విచారించారు. 24 సీసీ కెమెరాల్లో ఫుటేజ్ పరిశీలన చేశారు. సీఎం జగన్ పై జరిగిన దాడి కేసులో విచారణకు సిట్ ఏర్పాటు చేసింది పోలీస్ శాఖ. ఎస్పీ స్థాయి పోలీస్ అధికారి నేతృత్వంలో సిట్ ఏర్పాటు చేశారు సీపీ క్రాంతి(CP Kranthi). ఇప్పటికే ఈ కేసు దర్యాప్తు కొరకు ఆరు ప్రత్యేక అధికారుల బృందం రంగంలోకి విచారణ జరుపుతోంది. అజిత్‌సింగ్ నగర్ లో మూడు సెల్ ఫోన్ టవర్స్ నుంచి అధికారులు డంప్ స్వాధీనం చేసుకున్నారు. కాగా మొత్తం ఆ స్థలంలో 20 వేల సెల్ ఫోన్లు యాక్టివ్ గా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఘటన స్థలంలో ఉన్న సీసీ కెమెరాలను అధికారులు పర్యవేక్షిస్తున్నారు. జగన్ రూట్ మ్యాప్ లో ఉన్న అన్ని సీసీ టీవీ కెమెరాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. విజయవాడ సింగ్ నగర్ డాబా కోట్ల సెంటర్ వద్ద ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర(Memantha Siddham Bus Yatra) లో సీఎం జగన్ పై కొందరు ఆగంతకులు రాళ్లు విసరడం కలకలం రేపింది. సీఎం జగన్ కు ఓవైపు పూలు చల్లుతుండగా.. మరో వైపు కొందరు ఆగంతకులు రాళ్లు విసిరారు. ఈ ఘటనలో సీఎం జగన్ ఎడమ కంటికి రాయి తగిలింది. రాయి బలంగా తగలడంతో ఆయన ఎడమ కన్ను వాచింది. సీఎం జగన్ కు బస్సులో ప్రథమ చికిత్స అందిస్తున్నారు. ఈ దాడిలో MLA వెల్లంపల్లి ఎడమ కంటికిసైతం గాయం అయింది. Also Read : Kavitha: కవితకు మళ్ళీ జ్యుడీషల్ కస్టడీ..తీహార్‌కు తరలింపు #police #cm-jagan #andhra-paradesh #accused #attck మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి