AP PCC Chief YS Sharmila: ఏపీలో ఎన్నికలకు 13 రోజుల సమయం మిగిలి ఉండడంతో ప్రచారంలో స్పీడ్ పెంచారు కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. ఎన్నికల ప్రచారంలో సీఎం జగన్ పై విమర్శలు గుప్పించారు. బాబాయ్ రక్తం కళ్లారా చూసిన వారికి ఎవరైనా టికెట్ ఇస్తారా? అని ఆమె ప్రశ్నించారు. సొంత చెల్లిపై ఇష్టానుసారంగా మాట్లాడుతారా అని సీఎం జగన్ ను ఉద్దేశిస్తూ వ్యాఖ్యలు చేశారు షర్మిల.
ఏపీలో జరుగుతున్న ఈ ఎన్నికలు న్యాయానికి, నేరానికి మధ్య జరుగుతున్నాయి అని అన్నారు. కడప ఎంపీగా పోటీ చేస్తున్న నేను ఈ ఎన్నికల్లో ఓడిపోతే న్యాయం ఓడిపోతుంది అని పేర్కొన్నారు. ధర్మానికి, డబ్బుకు మధ్య జరుగుతున్న ఎన్నికలు ఇవి అని అన్నారు. సీఎం జగన్ సొంత బాబాయ్ ను చంపిన అవినాష్ రెడ్డికి టికెట్ ఇచ్చారని ఫైర్ అయ్యారు. ఈ ఎన్నికల్లో అవినాష్ రెడ్డి కి ఓటు వేస్తే కడపలో అన్యాయం రాజ్యమేలుతుందని అన్నారు.
సీఎం జగన్ భార్య భారతీ రెడ్డిని టార్గెట్ చేస్తూ విమర్శలు చేశారు షర్మిల. జగన్ రిమోట్ కంట్రోల్ ఇంట్లో ఉందని అన్నారు. నన్ను ఈ ఎన్నికల్లో ఓడించేందుకు కుట్ర చేస్తున్నారని తెలిపారు. సీబీఐ ఛార్జి షీట్ లో దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ని పేరును కాంగ్రెస్ చేర్చలేదని మరోసారి క్లారిటీ ఇచ్చారు షర్మిల. వైఎస్సార్ పెరి FIR లో కూడా లేదని అన్నారు. ప్రస్తుత ఏఐజీ సుధాకర్ రెడ్డే వైఎస్సార్ పేరును ఛార్జిషీట్ లో పెట్టారని ఆరోపణలు చేశారు. వైఎస్ పేరు లేకుంటే కేసు నుంచి బయటపడడం అసాధ్యమనే ఇలా చేశారని అన్నారు. జగన్ సీఎం అయ్యాక సుధాకర్ రెడ్డికి ఏఐజీ పదవి కట్టబెట్టారని ఫైర్ అయ్యారు. కన్నా తండ్రి పేరును సీఎం జగన్ ఛార్జిషీట్ లో పెట్టించారని ఆరోపణలు చేశారు.