(Report by Lokesh, Sr. Tirupathi Correspondent)
ఏపీలోని చిత్తూరు జిల్లా సోమల మండలం కరకమంద (Karakamanda) గ్రామానికి చెందిన పి.చంద్రమౌళి,అతడి సోదరుడు మురళి,తల్లి రాజమ్మ కలిసి ఉమ్మడిగా వ్యవసాయం చేస్తున్నారు.వారికి కరకమందలో 12 ఎకరాలు, పులిచెర్ల మండలం సువ్వారపు పల్లెలో 20 ఎకరాల పొలం ఉంది.ఇందులో 22 ఎకరాల్లో ఏళ్ల తరబడి టమాట పంటను సాగుచేస్తున్నారు.టమాట సాగులో తనకున్న అనుభవంతో పాటు ఆధునిక సాగు పద్ధతులు,మార్కెటింగ్ వ్యూహాలపై చంద్రమౌళి ఎప్పటికప్పుడు అవగాహన పెంచుకుంటారు.
దిగుబడి వచ్చేలా టమాట సాగు
ఏటా వేసవి తర్వాత టమాటకు మంచి ధర (Price) పలుకుతున్నట్లు గుర్తించి ఈసారి జూన్,జూలైలో దిగుబడి వచ్చేలా టమాట సాగు చేశారు.ఈ ఏడు ఏప్రిల్(April)లో సాహూ రకం టమాటను చంద్రమౌళి సాగు చేశారు.ఆధునిక పద్ధతులతో సూక్ష్మ సేద్యం విధానాలను అనుసరిస్తూ పండించారు. జూన్ నెలాఖరు నుంచి టమాట దిగుబడి మొదలు కాగా కర్ణాటక (Karnataka) లోని కోలార్ మార్కెట్(Kolar Market)లో పంటను విక్రయించారు.మార్కెట్‌లో 15 కిలోల టమాట(15Kgs Tomato) పెట్టెకు రికార్డు స్థాయిలో రూ.1000 నుంచి రూ.1500 ధర పలికింది.
టమాట సాగుతో రూ.4 కోట్ల ఆదాయం..
ఇప్పటి వరకు 40 వేల పెట్టెలను అమ్మగా.. రూ.4 కోట్ల ఆదాయం వచ్చిందని రైతు చంద్రమౌళి చెప్పారు.పెట్టుబడి ఖర్చు రూ.70 లక్షలు కాగా..మార్కెట్(Market) లో కమిషన్ రూ.20 లక్షలు, రవాణా ఖర్చులు రూ.10 లక్షలు పోగా మొత్తం రూ.3 కోట్ల (3 Crores) ఆదాయం వచ్చినట్లు సంతోషం వ్యక్తం చేశారు.రానున్న కాలంలో టమాట సాగుతో పాటుగా మరిన్ని పంటలను పండించనున్నట్లు ఆయన తెలిపారు.