Andhra Pradesh: ఏపీ మంత్రులకు ఛాంబర్ల కేటాయింపు

ఏపీ సచివాలయంలో మంత్రులకు ఛాంబర్‌లను కేటాయించారు. రెండో బ్లాక్‌లో ఏడుగురు, మూడో బ్లాక్‌లో ఐదుగురికి ఛాంబర్లను ఇచ్చారు. పవన్ కళ్యాణ్ పక్కనే నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్‌కు చాంబర్లను కేటాయించామని సాధారణ పరిపాలనాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

Andhra Pradesh: ఏపీ మంత్రులకు ఛాంబర్ల కేటాయింపు
New Update

AP Ministers: డిప్యూటీ ముఖ్యమంత్రి, మంత్రులకు ఛాంబర్లను కేటాయించింది సాధారణ పరిపాలన శాఖ. బ్లాక్‌-2లో ఏడుగురు, బ్లాక్‌-3లో ఐదుగురు, బ్లాక్‌ -4లో ఎనిమిది మంది, బ్లాక్‌-5లో ఐదుగురు మంత్రులకు ఛాంబర్లను కేటాయించింది. బ్లాక్‌-2లో డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌, మంత్రులు నాదెండ్ల మనోహర్‌, నారాయణ, కందుల దుర్గేశ్‌, అనిత, పయ్యావుల కేశవ్‌, ఆనం రామనారాయణరెడ్డిల ఛాంబర్లు ఉంటాయి. బ్లాక్‌-3లో మంత్రులు గొట్టిపాటి రవి, కొల్లు రవీంద్ర, సంధ్యారాణి, డోలా బాలవీరాంజనేయస్వామి, ఎన్‌ఎండీ ఫరూక్‌లకు, బ్లాక్‌-4లో అనగాని సత్యప్రసాద్‌, అచ్చెన్నాయుడు, సవిత, టీజీ భరత్‌, రాం ప్రసాద్‌రెడ్డి, కొలుసు పార్థసారథి, నిమ్మల రామానాయుడుకి కేటాయించారు. బ్లాక్‌-5లో బీసీ జనార్థన్‌రెడ్డి, కొండపల్లి శ్రీనివాస్‌, వాసంశెట్టి, సత్యకుమార్‌ల ఛాంబర్లు ఉంటాయని సాధారణ పరిపాలనశాఖ తెలిపింది.

డిప్యుటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు రెండో బ్లాక్ మొదటి అంతస్తులోని 211 రూమ్ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ పక్కనే నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్‌కు చాంబర్లు కేటాయించారు. ఇక నారా లోకేష్ కు నాలుగో బ్లాక్‌ మొదటి అంతస్తులోని రూమ్ నెంబర్ 208ను ఇచ్చారు.

Also Read:Bihar: ప్రారంభించకుండానే కూలిన బ్రిడ్జి..కోట్ల రూపాయలు నీళ్ళపాలు

#andhra-pradesh #ministers #secratariat #cabins
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe