ఆంధ్రప్రదేశ్‌కు మూడు సార్లు ముఖ్యమంత్రులుగా పని చేసిన చంద్రబాబు ఏనాడైనా ఒక్క ప్రాజెక్టును కూడా పట్టించుకోలేదు కానీ..ఇప్పుడు మాత్రం ప్రాజెక్టుల సందర్శన అంటూ దొంగయాత్రలు చేస్తున్నారంటూ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు విమర్శించారు.
రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తరువాతే కదా ప్రాజెక్టుల పనులు ముందుకు సాగాయి. జగన్ ముఖ్యమంత్రి అయిన తరువాత తండ్రికి తగ్గ కొడుకు అనిపించుకుంటూ..ఎలాంటి ఆర్భాటం లేకుండా ప్రాజెక్టుల పనులన్ని జరుపుతున్నారు.
మూడు సార్లు ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు ఇప్పటి వరకు రాష్ట్రానికి ఏం చేశారో చెప్పాలంటూ మండిపడ్డారు. ప్రాజెక్టుల విషయంలో ఎలాంటి అవినీతి జరగడం లేదు. అలాంటి ఆఫీసర్లనే జగన్ ఎన్నుకొని పనులు పూర్తి చేయిస్తున్నారు.
ఎన్నికలు దగ్గర పడుతున్నాయన్న ఉద్దేశంతో ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా యాత్రలు చేపట్టారు. మరి అధికారంలో ఉన్నప్పుడు ఇలాంటి యాత్రలు ఎందుకు చేపట్టలేదంటూ ప్రశ్నించారు.
గత ఎన్నికల్లో కనీసం 23 సీట్లు అయిన వచ్చాయి. కానీ ఈసారి అవి కూడా 23 కాదు కదా ఒక్క సీటు కూడా రాదు అని ఆయన అన్నారు. అతి త్వరలో ఏపీలో టీడీపీ తుడిచిపెట్టుకుపోతుందని ఆయన అన్నారు.
రాయలసీమ ద్రోహి ఎవరూ అంటే అందరికీ గుర్తుకు వచ్చే పేరు చంద్రబాబు నాయుడు. రాయలసీమనే అన్యాయం చేసిన వ్యక్తి చంద్రబాబు అంటూ మండిపడ్డారు. ఆంధ్ర రాయలసీమ ద్రోహిగా చంద్రబాబు చరిత్రలో నిలిచిపోతారు.
రెండు వేల నోట్లు తన వల్లే క్యాన్సిల్ అయ్యిందని చంద్రబాబు డప్పు కొట్టుకుంటున్నారు. ఆయనకు కచ్చితంగా చిన్న మెదడు చితికి పోయిందేమో అని మంత్రి ఎద్దేవా చేశారు.
కనీసం ఆయన ఏం మాట్లాడుతున్నాడో ఆయకైనా అర్థం అవుతుందా అంటూ కారుమూరి నాగేశ్వరరావు అన్నారు.