చంద్రబాబు తప్పు చేసినట్టు ప్రాథమిక ఆధారాలు స్పష్టంగా ఉన్నాయని ఏపీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. ఈ రోజు ఆయన గుంటూరులో మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు తప్పు చేసిన కారణంగానే ఎంత మంది సీనియర్ న్యాయవాదులు వాదిస్తున్నా బెయిల్ దొరకలేదన్నారు. చంద్రబాబు 5 కిలోల బరువు తగ్గారని కుటుంబ సభ్యులే అబద్దాలు చెబుతున్నారని అంబటి రాంబాబు ఆరోపించారు. కావాలనే చంద్రబాబు ఆరోగ్యంపై అసత్య కథనాలు ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. చంద్రబాబుకు ఏసీ సౌకర్యం కల్పించాలని 35 రోజుల నుంచి కోర్టులో ఎందుకు పిటిషన్ వేయలేదని ప్రశ్నించారు. చంద్రబాబుకు ఎప్పటినుంచో చర్మ సమస్యలు ఉన్నాయన్నారు. ఏ రాష్ట్రంలోనూ ఎవరికీ ఏసీ ఇవ్వలేదు కానీ, చంద్రబాబుకు ఇచ్చారని మంత్రి అన్నారు.
ఇది కూడా చదవండి: నేరేడుపండ్ల మాదిరిగా ఉన్న ఫ్యూట్
కోర్టు అనేక సదుపాయాలు ఇచ్చింది
స్కిల్ స్కాం కేసులో చంద్రబాబుపై ఆధారాలు ఉన్నాయి కాబట్టే సీఐడీ అరెస్ట్ చేసిందని స్పష్టం చేశారు. ఎవరి మీద కక్ష్య సాధించాలన్న ఉద్దేశ్యం వైసీపీ ప్రభుత్వానికి లేదని అంబటి పేర్కొన్నారు. పురందేశ్వరి ఏ పార్టీ అధ్యక్షురాలో తెలియాలని ప్రశ్నించారు. ఎన్టీఆర్ కుమార్తెకు అధికారం ఉన్న పార్టీలలో వెళ్లడం.. చంద్రబాబును కాపాడటం అలవాటైందంటూ అంటూ ఆరోపించారు. జ్యూడీషియల్ రిమాండ్ ఖైదీగా ఉన్న చంద్రబాబుకు కోర్టు అనేక సదుపాయాలు ఇచ్చిందని మంత్రి అంబటి రాంబాబు తెలిపారు. ప్రత్యేక ఆహారం, మందులు తీసుకునే అవకాశం ఇచ్చారన్నారు. 17ఏ ప్రకారం చంద్రబాబుపై కేసు కొట్టేయాలని చేసిన డిమాండ్‌ను కోర్టులు తిరస్కరించాయన్నారు. తప్పు చేశాడు కాబట్టి, సాక్ష్యాలను తారు మారు చేస్తాడనే ఉద్దేశంతో కోర్టులు ఇప్పటి వరకు చంద్రబాబుకు బెయిల్ కూడా ఇవ్వలేదని ఆయన ఆరోపించారు. చంద్రబాబు ఆరోగ్యం విషమం అని కొత్త ప్రచారాలు చేస్తున్నారని.. చంద్రబాబు ఇంటి నుంచి వచ్చే ఆహారంలో స్టెరాయిడ్స్ ఎవరు కలిపి ఇస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు.
బెయిల్ ఎందుకు రావడం లేదో..?
చంద్రబాబు ఆరోగ్యంపై డాక్టర్లు చెప్పాలి.. టీడీపీ నాయకులు కాదని అంబటి అన్నారు. జైలు అధికారులు నిబంధనల ప్రకారమే నడుచుకుంటారన్నారు. చంద్రబాబు ఏసీ అడిగిన గంటలోనే కోర్టు అనుమతించిందన్నారు. ఖరీదైన లాయర్లను పెట్టుకున్నా.. చంద్రబాబుకు బెయిల్ ఎందుకు రావడం లేదో టీడీపీ కార్యకర్తలు ఆలోచించాలని మంత్రి పేర్కొన్నారు. రాజకీయ లబ్ది పొందాలనే ఏసీ కావాలని చంద్రబాబు అడగలేదని ఆరోపించారు. చంద్రబాబును ఆస్పత్రికి తరలించాలన్న ఉద్దేశంతోనే ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారని మంత్రి ఫైర్ అయ్యారు. నిజాలు చెప్పకుండా ప్రజలను మభ్యపెడుతున్నారు.
ఇది కూడా చదవండి: పెద్దపల్లిలో దారుణం.. వానరాల ఉసురు ఊరికే పోదు!