AP politics:భవిష్యత్తులో నాకైనా టికెట్ రాకపోవచ్చు..మంత్రి అమర్ నాథ్ హాట్ కామెంట్స్

మంగళగిరి, గాజువాక ఇంఛార్జ్ లను మార్చడంపై వైసీపీలో కలకలం రేగింది. ఇలా సడెన్ గా ఇంఛార్జ్ లను మార్చడాన్ని కొంత మంది వ్యతిరేకిస్తున్నారు. దీని వెనుక కారణాలేంటా అని ఆరాలు తీస్తున్నారు. కానీ పార్టీ బావుండాలి అంటూ మార్పులు సహజమని చెబుతున్నారు మంత్రి అమర్ నాథ్.

New Update
AP : చిక్కుల్లో మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌.. VMRDAకు జనసేన ఫిర్యాదు..!

రీసెంట్ గా వైసీపీ ప్రభుత్వం గాజువాక, మంగళగిరి ఇంఛార్జ్ లను మార్చింది. దీనిలో గాజువాక ఇంఛార్జ్ ని మార్చడంలో నా ప్రమేయం ఏమీ లేదంటూ ఆర్టీవీ మాట్లాడుతూ హాట్ కామెంట్స్ చేశారు మంత్రి అమర్ నాథ్. పార్టీ కొన్ని నిర్ణయాలకు మాత్రమే జిల్లా మంత్రిగా తనను సంప్రదిస్తుందని అంటున్నారు. భవిష్యత్తులో నాకైనా టికెట్ రాకపోవచ్చు.. కానీ పార్టీ జెండా మోయాల్సిందే..అంటూ తేల్చి చెప్పారు. తిప్పల నాగిరెడ్డి, దేవన్ రెడ్డి నాకు సన్నిహితులే. అలాగే ఇప్పుడు గాజువాక ఇంచార్జి గా ప్రకటించిన చందు కుటుంబం కూడా సుదీర్ఘ కాలం నుంచి రాజకీయాల్లో ఉన్నారు. నాకు బాగా తెలిసినవాళ్ళే అన్నారు మఅర్ నాథ్.

Also Read:సీఎం రేవంత్ రెడ్డి కొత్త టీమ్ లిస్ట్ ఇదే.. ఐటీ హెడ్ ఎవరో తెలుసా?

ప్రజాధారణ తగ్గిన నాయకులను మార్చడం సహజం దానికి ఎవ్వరూ బాధపడాల్సిన అవసరం లేదు. ఇందులో విపరీతార్థాలేమీ లేవంటూ కామెంట్స్ చేశారు మంత్రి అమర్ నాథ్. పార్టీ విజయం కోసమే సీఎం జగన్ ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారని బలంగా నమ్ముతున్నా అని చెబుతున్నారు. ఇంఛార్జ్ లను మార్చడంలో యువగళం పాదయాత్ర కోసం ఎక్కడా చర్చ జరగలేదు. అలాగే లోకేష్ పాదయాత్ర వలన మాకు వచ్చే నష్టం ఏమీ లేదని తేల్చి చెప్పారు.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు