Amalapuram : అమలాపురం ఎంపీ సీటుకోసం వైసీపీ(YCP) నుంచి రాపాక వరప్రసాద్, టీడీపీ(TDP) అభ్యర్థిగా గంటి హరీష్ మాధుర్ పోటీ పడుతున్నారు. 2019లో జనసేన(Janasena) నుంచి గెలిచిన ఏకైక ఎమ్మెల్యేగా రాపాక గుర్తింపు తెచ్చుకున్నారు. కానీ వైసీపీలోకి మారడంతో జనసైనికుల్లో ఆయన పట్ల తీవ్ర వ్యతిరేకత ఉంది. ఎంపీగా పోటీ చేయడం ఇదే మొదటిసారి. రాపాక మీద ఉన్న వ్యతిరేకత చూస్తే గెలుపు అసాధ్యం.
Also Read : కొనసాగుతోన్న 3వ దశ లోక్ సభ ఎన్నికల పోలింగ్ పోలింగ్
కూటమి అభ్యర్థి గంటి హరీష్ మాధుర్ యువకుడు, ఉత్సాహవంతుడు. బాలయోగి కొడుకుగా మంచి గుర్తింపు ఉంది. గత ఎన్నికల్లో స్వల్ప మెజారిటీతో ఓడిపోయాడనే సింపతీ ప్లస్. అమలాపురం పార్లమెంట్‌లో హరీష్ మాధుర్ బంపర్ విక్టరీ ఖాయమని ఆర్టీవీ స్టడీలో తేలింది. పూర్తి వివరాల కోసం వీడియో చూడిండి.