AP Game Changer 2024 : ఆర్టీవీ స్టడీలో ఆసక్తికర లెక్కలు.. అరకు ఎంపీగా గెలిచేదవరంటే? అరకు లోక్‌సభ సీటులో BJP అభ్యర్థి కొత్తపల్లి గీత, YCP అభ్యర్థి శెట్టి తనూజరాణి మధ్య హోరాహోరీగా ఫైట్ సాగుతోంది. వీరిలో ఎవరు గెలుస్తారు? ఆర్టీవీ స్టడీలో ఏం తేలింది? తెలుసుకోవడానికి ఈ ఆర్టికల్ చదవండి. By Nikhil 06 May 2024 in ఆంధ్రప్రదేశ్ Latest News In Telugu New Update షేర్ చేయండి Araku : ఇక అరకు లోక్‌సభ(Lok Sabha) సీటులో BJP అభ్యర్థి కొత్తపల్లి గీత, YCP అభ్యర్థి శెట్టి తనూజరాణి పోటీ పడుతున్నారు. ఏజెన్సీ ప్రాంతంలో డాక్టర్‌గా పని చేయడం తనూజరాణికి ప్లస్. ఆమెకు వ్యక్తిగతంగా క్లీన్ ఇమేజ్ ఉంది. అయితే తనూజరాణి మామ వైసీపీ ఎమ్మెల్యే శెట్టి ఫల్గుణఫై ఆరోపణలు ఆమెకు మైనస్. బీజేపీ అభ్యర్థి కొత్తపల్లి గీతకు పార్టీ పెద్దల అండ పుష్కలంగా ఉంది. ఆమె సామాజికవర్గంపై వివాదం మైనస్. ఆర్థికంగా బలంగా ఉండటం, ఒకసారి గెలిచి ఉండటం ప్లస్. భూకబ్జా, చెక్ బౌన్స్ కేసులు(Cheque Bounce Case) కొత్తపల్లి గీతకు పెద్ద మైనస్. ఎన్నికలు ఎంత త్వరగా జరిగితే వైసీపీకి ఇక్కడ అంత మంచిదనే టాక్ నడుస్తోంది. ఎందుకంటే కూటమి బలం రోజు రోజుకూ పెరుగుతోంది. ప్రస్తుతానికి వైసీపీ అభ్యర్థి తనూజరాణికే ఎడ్జ్ కనిపిస్తోంది. Also Read : విశాఖ ఎంపీగా బాలకృష్ణ అల్లుడు భరత్ గెలుపు? ఆర్టీవీ సర్వే లెక్కలివే! #2024-lok-sabha-elections #bjp #ap-tdp #ap-ycp #araku మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి