AP JOBS : ఏపీ వైద్యారోగ్య శాఖలో 76 ఉద్యోగాలు.. టెన్త్ ఉంటే చాలు

ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని ప్రభుత్వాసుపత్రుల్లో 76 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. కాంట్రాక్ట్ విధానంలో మెడికల్ ఆఫీసర్, స్టాఫ్ నర్స్, ల్యాబ్ టెక్నీషియన్ ఖాళీలను భర్తీ చేయనుండగా ఆసక్తిగల అభ్యర్థులు డిసెంబర్ 15వరకూ అప్లై చేసుకోవాలి.

New Update
AP JOBS : ఏపీ వైద్యారోగ్య శాఖలో 76 ఉద్యోగాలు.. టెన్త్ ఉంటే చాలు

Medical Jobs : ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) రాష్ట్రం ఇటీవల వరుస ఉద్యోగ నోటిఫికేషన్స్ రిలీజ్ చేస్తుంది. ఇటీవలే నెల్లూరులోని జిల్లా వైద్య, ఆరోగ్య అధికారి కార్యాలయంలోని 26 పోస్టుల భర్తీకి ధరఖాస్తు కోరిన విషయం తెలిసిందే. కాగా తాజాగా మరో ఉద్యోగ ప్రకటన చేసింది. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని ప్రభుత్వాసుపత్రుల్లో పలు పోస్టుల భర్తీకి ఆసక్తిగల అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరింది. ఈ మేరకు కాకినాడ(Kakinada)లోని జిల్లా వైద్యారోగ్య అధికారి కార్యాలయంలోలో కాంట్రాక్ట్ విధానంలో పలు మెడికల్ ఆఫీసర్, స్టాఫ్ నర్స్, ల్యాబ్ టెక్నీషియన్ తదితర 76 ఖాళీలను భర్తీ చేయబోతున్నట్లు తెలిపింది. ఈ పోస్టుల అప్లై చేసుకునే అభ్యర్థులు 10వ తరగతి, డిప్లొమా, డిగ్రీ, ఎంబీబీఎస్ ఉత్తిర్ణులై ఉండాలి.

1. మెడికల్ ఆఫీసర్ : 18
2. స్టాఫ్ నర్స్ : 43
3. ల్యాబ్ టెక్నీషియన్ : 06
4. సీనియర్ ట్యూబర్క్యులోసిస్ ల్యాబోరేటరీ : 01
5. క్వాలిటీ మేనేజర్ : 01
6. ఆడియో మెట్రికేషన్ : 03
7. ఫార్మసిస్ట్ : 02
8. ఎల్ జీఎస్ : 02

ఇది కూడా చదవండి : డీప్ ఫేక్ వీడియోపై అలియా ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. అద్భుతాలు చేస్తున్నారంటూ

ఇక ఈ మొత్తం పోస్టుల సంఖ్య 76 ఉండగా పోస్టును అనసరించి టెన్త్, డిప్లొమా, డిగ్రీ, ఎంబీబీఎస్ ఉత్తిర్ణులై ఉండాలి. అర్హతలున్న అభ్యర్థులు ఆన్ లైన్ వేదికగా 2023 డిసెంబర్ 15 వరకూ దరఖాస్తు చేసుకోవాలని సంబంధిత అధికారులు సూచించారు.

Advertisment
తాజా కథనాలు