BUDGET 2024 : ఏపీకి కేంద్ర బడ్జెట్‌లో పెద్దపీట.. చక్రం తిప్పనున్న చంద్రబాబు! ఈసారి ఏపీకి కేంద్ర బడ్జెట్‌లో పెద్దపీట వెయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు కేంద్రంలో చంద్రబాబే బిగ్ బాస్ కావడంతో భారీగా నిధులు వచ్చే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. హైదరాబాద్ లాగానే అమరావతిని కూడా చంద్రబాబు తీర్చి దిద్దుతారని అభిప్రాయపడుతున్నారు. By srinivas 24 Jun 2024 in ఆంధ్రప్రదేశ్ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Andhra Pradesh : ఈసారి ఏపీకి కేంద్రం బిగ్ సర్‌ప్రైజ్ ఇస్తుందా? రానున్న కేంద్ర బడ్జెట్ (Union Budget) లో ఏపీకి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) పెద్దపీఠ వెయనున్నారా? అంటే అవుననే సమాధానమే వస్తోంది. ఎందుకంటే ఇప్పుడు కేంద్రంలో చంద్రబాబే (Chandrababu) బిగ్ బాస్.. ఇటు ఏపీకి రాజధాని నిర్మాణం అన్నిటికంటే కీలకం. చంద్రబాబు సైతం అమరావతి అభివృద్ధిపైనే ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు. దీంతో ఈ సారి కేంద్రం నుంచి ఏపీకి భారీగా నిధులు వచ్చే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. రాష్ట్రానికి కలిసొచ్చే అంశం ఇదే.. గడిచిన దశాబ్దంలో మోదీ (PM Modi) అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రాలతో పోలిస్తే కేంద్ర ప్రభుత్వం ఆర్థికంగా చాలా అభివృద్ధి చెందింది. ముఖ్యంగా ఆదాయాన్ని పెంచుకోవడం విషయంలో కేంద్రం పాలసీలు సక్సెస్ అయ్యాయి. దీనికి 2017లో కేంద్రం ప్రవేశపెట్టిన పన్ను విధానమే ఉదాహరణ. అయితే కేంద్ర నిర్ణయాలు ఇటు రాష్ట్ర ఆదాయాలను తగ్గించాయని చెబుతుంటారు పలువురు ఆర్థిక నిపుణులు. నిధులను పొందేందుకు రాష్ట్రాలకు ఇబ్బందులు తలెత్తాయని అంటుంటారు. మోదీ సపోర్ట్ లేకుండా రాజధాని అమరావతి కోసం నిధులు తెచ్చుకోవడం సాధ్యం కాదు. అయితే ఇప్పుడు ఏపీలో సంకీర్ణ ప్రభుత్వం ఉండడం.. అందులో బీజేపీ కీలక భాగంగా ఉండడం రాష్ట్రానికి కలిసొచ్చే అంశం. బీజేపీకి సొంత మెజార్టీ మార్క్.. 2024 లోకసభ ఎన్నికల్లో (Lok Sabha Elections 2024) బీజేపీకి సొంతంగా మెజార్టీ మార్క్ రాలేదు. 543 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో 240 ఎంపీ సీట్లు సాధించిన బీజేపీ మ్యాజిక్ ఫిగర్‌కు 32 స్థానాల దూరంలో నిలిచింది. దీంతో ఏపీ నుంచి టీడీపీ, బిహార్ నుంచి జేడీయూ మోదీ ప్రభుత్వ ఏర్పాటులో కీలక పాత్ర పోషించాయి. ఒక్కమాటలో చెప్పాలంటే చంద్రబాబు, నితీశ్‌కుమార్ ఇద్దరూ ఎన్డీయేకు కింగ్‌మేకర్లగా మారారు. దీంతో ఏపీ, బీహార్‌కు కేంద్రం నుంచి కొండంత అండ దక్కింది. ఇది నిధులను తెప్పించుకోవడానికి, కొత్త ప్రాజెక్టులు కట్టుకోవడానికి ప్లస్ అవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. హైదరాబాద్ రూపురేఖలు మారిపోయాయి.. నిజానికి 1995లో చంద్రబాబు సీఎంగా అవతరించిన తర్వాత హైదరాబాద్ రూపురేఖలు మారిపోయాయని చెబుతుంటారు విశ్లేషకులు. హైదరాబాద్ నగరాన్ని టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ హబ్‌గా మార్చింది చంద్రబాబేనని గుర్తు చేస్తున్నారు. 2014లో రాష్ట్ర విభజనకు ముందు ఏపీకి వృద్ధి రేటు బాగానే ఉందని చెబుతున్నారు. దేశంలోని అత్యంత వెనుకబడిన రాష్ట్రాల జాబిత నుంచి అత్యంత అభివృద్ధి చెందిన రాష్ట్రాలలో ఒకటిగా ఏపీ మారడానికి చంద్రబాబు విజన్ కారణమని.. హైదరాబాద్ లాగానే అమరావతిని కూడా ఆయన తీర్చి దిద్దుతారని అభిప్రాయపడుతున్నారు. బీజేపీ నుంచి ఆశించిన స్థాయిలో సహకారం అందలేదు.. ఇక 2014 ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత ఏపీ భారీగా అప్పులు చేసింది. 2014 నుంచి 2019 వరకు ఏపీ సీఎంగా చంద్రబాబునాయుడు ఉన్నారు. 2018 వరకు బీజేపీతో టీడీపీ మిత్రపక్షంగానే ఉంది. అయితే ఆ ఐదేళ్లలో ఏపీకి బీజేపీ నుంచి ఆశించిన స్థాయిలో సహకారం అందలేదని చంద్రబాబు విమర్శలు చేసి ఎన్డీఏ నుంచి బయటకు వచ్చారు. స్పెషల్ స్టెటస్‌కు బదులుగా స్పెషల్ ప్యాకేజీని చంద్రబాబు అంగీరించడం కూడా ఏపీకి నష్టం చేసిందని నాడు ప్రతిపక్షంగా ఉన్న వైసీపీ ఆరోపించింది. అయితే ఇప్పుడు పరిస్థితులు వేరు. ఎన్డీయేలో టీడీపీకి ఉన్న ప్రాధాన్యత వేరు.. అందుకే ఏపీకి ఈసారి కేంద్రం నుంచి పెద్ద ఎత్తున సహాకారం అందడం కన్ఫామ్‌గా తెలుస్తోంది. ఇది రానున్న బడ్జెట్ సెషన్ నుంచే ప్రారంభమవుతుందని అంచనా. ముఖ్యంగా రెవెన్యూ లోటు భర్తీకి బడ్జెట్‌లో పూర్తి నిధులను కేంద్రం కేటాయిస్తుందని సమాచారం. ఏపీకి చెందిన అనేక అంశాల పైనా బడ్జెట్‌లో ప్రకటనలు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. Also Read : హైదరాబాద్‌లో భారీ వర్షం.. రోడ్లన్నీ జలమయం #ap-cm-chandrababu #union-budget-2024 #nirmala-sitharaman మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి