Chandrababu: అప్పటి వరకు నో అరెస్ట్.. చంద్రబాబుకు ఏపీ హైకోర్టులో తాత్కాలిక ఊరట!

ఇన్నర్ రింగ్ రోడ్, ఇసుక పాలసీ కేసులకు సంబంధించి చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్లపై ఈ రోజు ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. ఈ రెండు కేసులను ఈ నెల 29, 30 తేదీలకు వాయిదా వేసింది. అప్పటి వరకు చంద్రబాబును ఆయా కేసుల్లో అరెస్ట్ చేయవద్దని ఆదేశాలు జారీ చేసింది.

New Update
Chandrababu: పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హతపై స్పీకర్ కు తన అభిప్రాయం పంపిన చంద్రబాబు

ఇన్నర్ రింగ్ రోడ్ (IRR), ఉచిత ఇసుక పాలసీ (Free Sand Policy) అక్రమాల కేసుల్లో చంద్రబాబు (Chandrababu) దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్లపై ఈ రోజు ఏపీ హైకోర్టులో (AP High Court) విచారణ జరిగింది. ఈ రెండు కేసులను న్యాయస్థానం వాయిదా వేసింది. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో తదుపరి విచారణను ఈ నెల 29కి వాయిదా వేసింది. అప్పటి వరకు చంద్రబాబును అరెస్ట్ చేయవద్దని ఉన్న మధ్యంతర ఉత్తర్వులు కొనసాగుతాయని ఆదేశాలు జారీ చేసింది. సీఐడీ అభ్యర్థన మేరకు ఈ కేసు విచారణను హైకోర్టు వాయిదా వేసింది. ఉచిత ఇసుక పాలసీలో అక్రమాల కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ పై సైతం హైకోర్టులో ఈ రోజు విచారణ జరిగింది. ఈ కేసు తదుపరి విచారణను ఈ నెల 30కి వాయిదా వేసింది హైకోర్టు. తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు ఎలాంటి చర్యలు చేపట్టవద్దని సీఐడీకి కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
ఇది కూడా చదవండి: Heavy Rains: తెలుగు రాష్ట్రాల్లో పలు చోట్ల భారీ వర్షాలు..మరో రెండు రోజుల పాటు కురిసే ఛాన్స్‌!

ఈ వార్త అప్డేట్ అవుతోంది..

Advertisment
Advertisment
తాజా కథనాలు