Andhra Pradesh : మన చరిత్ర ఏంటో ప్రపంచం చూసింది.. హింసాత్మక ఘటనలపై హైకోర్టు ఆవేదన

ఏపీలో ఎన్నికల సందర్భంగా పల్నాడు జిల్లాలో జరిగిన హింసాత్మక ఘటనపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై విచారించిన న్యాయస్థానం.. పల్నాడు జిల్లాలో జరిగిన హింసాత్మక ఘటనలు రాష్ట్ర ప్రజలకే కాదు ప్రపంచానికే చూపించామంటూ ఆవేదన వ్యక్తం చేసింది.

New Update
Andhra Pradesh : మన చరిత్ర ఏంటో ప్రపంచం చూసింది.. హింసాత్మక ఘటనలపై హైకోర్టు ఆవేదన

High Court Key Comments : ఏపీ(AP) లో ఎన్నికల(Elections) సందర్భంగా పల్నాడు జిల్లా(Palnadu District) లో జరిగిన హింసాత్మక ఘటనలు సంచలనం రేపిన సంగతి తెలిసిందే. దీనిపై హైకోర్టు(High Court) కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ ఘటనలు వల్ల రాష్ట్ర ప్రజలకే కాదు.. మన చరిత్ర ఏంటో ప్రపంచానికే చూపించామని పేర్కొంది. రాష్ట్రంలో.. ముఖ్యంగా పల్నాడు జిల్లాలో జరిగిన ఘటనలు అందరూ చూశారని.. ఇందుకు ఆధారాలు పరిశీలించాల్సిన అవసరం లేదంటూ ఈ హింసాత్మక ఘటనపై ఆవేదన వ్యక్తం చేసింది.

Also Read: ఏపీ ఆందోళన పరిస్థితులపై ఈసీ సంచలన నిర్ణయం.. అప్పటి వరకు కేంద్రబలగాలు రాష్ట్రంలోనే..

పల్నాడులో శాంతిభద్రతల పరిరక్షణకు అన్ని చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి, డీజీపీలతో సహా పల్నాడు జిల్లా కలెక్టర్, ఎస్పీలను హైకోర్టు ఆదేశించింది. అదనపు బలగాలను మోహరించాలంటూ పిటిషనర్ సమర్పించిన వినతిపై నిర్ణయం తీసుకోవాలని సూచించింది. అయితే పల్నాడు జిల్లా వ్యాప్తంగా ఎన్నికల రోజు.. ఆ తర్వాత హింసాత్మక ఘటనలు జరిగాయని.. వాటని అడ్డుకోవడంలో పోలీసులు విఫలమయ్యారని వినుకొండకు చెందిన నలబోతు రామకోటేశ్వరరావు హైకోర్టులో పిటిషన్ వేశారు. పరిస్థితులు అదుపు చేసేందుకు అదనపు బలగాలను మోహరించేలా కోర్టు ఆదేశించాలి కోరారు. పిటిషనర్ తరఫు న్యాయవాది పదిరి రవితేజ వాదనలు వినిపించారు. హింసా ఘటనలకు చెందిన ఆడియోను వినాయని ఆయన న్యాయమూర్తిని కోరాడు. దీనికి స్పందించిన న్యాయమూర్తి.. ఇది వినాల్సిన అవసరం లేదని.. పల్నాడు ఘటన రాష్ట్ర ప్రజలకే కాదు ప్రపంచానికే చూపామంటూ వ్యాఖ్యానించారు.

మరోవైపు ఈసీ తరఫు న్యాయవాది తమ వాదనలు వినిపించారు. అదనపు బలగాను మోహరించాలంటూ పిటిషనర్ ఇచ్చిన వినతి పరిశీలనలో ఉందని తెలిపారు. భద్రత విషయంలో ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో అనేది రాష్ట్ర హోంశాఖ సమాధానం చెప్పాల్సి ఉంటుందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం, పోలీసుల తరఫున ఏజపీ నిర్మల్‌ కుమార్ వాదిస్తూ.. హింసాత్మక ఘటనపై ఈసీ ఇప్పటికే వివరణ కోరిందని.. ప్రస్తుతం పల్నాడులో 144 సెక్షన్ విధించామని పరిస్థితులు అదుపులో ఉన్నాయని చెప్పారు. అలాగే అదనపు పోలీసు బలగాలను మోహరించామని చెప్పారు. ఈ అంశాలను పరిగణలోకి తీసుకున్న న్యాయమూర్తి.. రాష్ట్ర ప్రభుత్వం, ఈసీ చర్యలు తీసుకోవడం ప్రారంభించినట్లు గుర్తుచేశారు.

Also Read: కామన్ అడ్మిషన్లకు కాలం చెల్లు.. ఏపీ కోటాకు బ్రేక్!

Advertisment
Advertisment
తాజా కథనాలు