Pinnelli Ramakrishna Reddy: పోలింగ్ కేంద్రంలో ఈవీఎంను ధ్వంసం చేసిన కేసులో మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా న్యాయస్థానం ఈ ఘటనపై విచారణ జరిపింది. ఈ నేపథ్యంలో పిన్నెల్లి తరఫున లాయర్ కోర్టులో వాదనలు వినిపించారు. ' ట్విట్టర్‌లో నారా లోకేశ్ ఈవీఎం ధ్వంసం చేసిన వీడియో పోస్ట్ చేశారు. ఆ వీడియో ఆధారంగా కేసు నమోదు చేశారు. నోటీసులు ఇవ్వకుండా అరెస్టుకు వెళ్లడం సరికాదు. పిన్నెల్లిని అరెస్ట్ చేయాలని ఈసీ నేరుగా ఆదేశాలు ఇవ్వడం కూడా సరికాదు.
Also read: రాగల రెండ్రోజులు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు
లోకేశ్ ట్విట్టర్‌లో పెట్టిన వీడియో ఆధారంగా ఇదంతా చేస్తున్నారు. గుర్తు తెలియని వ్యక్తులు ఈవీఎం ధ్వంసం చేశారని పోలింగ్ ఆఫీసర్ చెప్పారు. పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్‌లో కూడా ఇవే అంశాలు ఉన్నాయి. నారా లోకేష్ (Nara Lokesh) పోస్టు చేసిన వీడియో.. మార్ఫింగ్ వీడియో కూడా అయ్యే అవకాశం ఉంది. ఏడేళ్లలోపు శిక్షపడే సెక్షన్లతో కేసు నమోదు చేసినా కూడా నోటీసులు ఇవ్వొచ్చని' పిన్నెల్లి తరఫు లాయర్ వాదించారు. అయితే హైకోర్టు ఏ నిర్ణయం తీసుకుంటుంది అనే దానిపై ఉత్కంఠ నెలకొంది.
Also Read: ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. జూన్ 30 వరకూ ఆ రైళ్లు అన్నీ రద్దు!