Peddireddy : మాజీ మంత్రి పెద్దిరెడ్డికి షాక్.. అరెస్ట్ తప్పదా?

AP: మాజీ మంత్రి పెద్దిరెడ్డికి హైకోర్టు షాక్ ఇచ్చింది. వైసీపీ పాలనలో తన ఇంటి ముందు రోడ్డుపై ఏర్పాటు చేసిన గేట్లు తెరవాలని హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. కాగా జనసేన నేతలు వేసిన పిటిషన్‌ను విచారించిన ధర్మాసనం పెద్దిరెడ్డికి వ్యతిరేకంగా తీర్పు వెలువరించింది.

New Update
Peddireddy : మాజీ మంత్రి పెద్దిరెడ్డికి షాక్.. అరెస్ట్ తప్పదా?

Shock To Peddireddy : మాజీ మంత్రి పెద్దిరెడ్డికి వరుస షాక్‌లు తగులుతున్నాయి. ఇప్పటికే పెద్దిరెడ్డి భూదందాలపై భారీగా ఫిర్యాదులపై కలకలం రేపగా.. తాజాగా హైకోర్టులో పెద్దిరెడ్డికి వ్యతిరేకంగా కీలక తీర్పు వచ్చింది. పెద్దిరెడ్డి ఇంటి ముందు రోడ్డుపై ఏర్పాటు చేసిన గేట్లు తెరవాలని హైకోర్టు (High Court) ఆదేశం ఇచ్చింది. వైసీపీ (YCP) పాలనలో తన ఇంటివైపున్న రోడ్డుకు గేటు ఏర్పాటు చేశారు మాజీ మంత్రి పెద్దిరెడ్డి (Minister Peddireddy).

రోడ్డుపై గేటు తొలగించాలని కొన్నిరోజులుగా జనసేన పోరాటం చేస్తోంది. ఈ క్రమంలో గేటు తొలగించేలా చర్యలు తీసుకోవాలని జనసేన హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. జనసేన పిటిషన్‌పై విచారించిన హైకోర్టు.. పబ్లిక్ రోడ్డుపై గేటు తొలగించాలని మున్సిపల్‌ అధికారులకు హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. హైకోర్టు ఆదేశాలతో గేట్లు తెరుచుకున్నాయి. గేట్ల తొలగింపుపై స్థానికుల హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Also Read : కేజ్రీవాల్‌, కవిత జ్యుడీషియల్‌ కస్టడీ మళ్లీ పొడిగింపు


Advertisment
తాజా కథనాలు