Andhra Pradesh: చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ.. 15వ తేదీకి వాయిదా..

స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్‌పై ఇవాళ హైకోర్టులో విచారణ జరిగింది. ఈ కేసులో వాదనలు విన్న ధర్మాసనం.. విచారణను ఈ నెల 15వ తేదీకి వాయిదా వేసింది. అలాగే, ఏపీ ఫైబర్ గ్రిడ్ కేసులో ఆస్తుల అటాచ్‌మెంట్ పిటిషన్ పై విచారణ వాయిదా పడింది.

New Update
DSC Notification: ఏపీలో టెట్, టీఆర్టీ పరీక్షల నిలిపివేయాలంటూ పిటిషన్.. హైకోర్టు కీలక నిర్ణయం

Chandrababu Bail Petition: టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ విపక్ష నేతల చంద్రబాబు(Chandrababu)పై నమోదైన వివిధ కేసులకు సంబంధించి పిటిషన్లపై ఆయా కోర్టుల్లో శుక్రవారం నాడు విచారణ జరిగింది. దాదాపు అన్ని కేసుల్లో విచారణ వాయిదా పడ్డాయి. స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్‌పై ఇవాళ హైకోర్టులో విచారణ జరిగింది. ఈ కేసులో వాదనలు విన్న ధర్మాసనం.. విచారణను ఈ నెల 15వ తేదీకి వాయిదా వేసింది. సీఐడీ విజ్ఞప్తి మేరకు కేసు విచారణను వాయిదా వేసింది కోర్టు. కాగా, ఇప్పటికే ఈ కేసులో చంద్రబాబు తరఫున న్యాయవాదులు సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్‌ను దాఖలు చేశారు. క్వాష్ పిటిషన్‌పై తీర్పును సుప్రీంకోర్టు రిజర్వ్ చేసింది. అలాగే స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసును సీబీఐకి ఇవ్వాలని కోరుతూ ఉండవల్లి అరుణ్ కుమార్ దాఖలు చేసిన రిట్ పిటిషన్‌పైనా ఏపీ హైకోర్టులో ఇవాళ విచారణ జరిగింది. స్కిల్ స్కామ్ కేసును సీబీఐ విచారణఖు ఇవ్వడంపై తమకు ఎలాంటి అభ్యంతరం లేదని హైకోర్టుకు తెలిపారు అడ్వకేట్ జనరల్. అయితే, సీబీఐ విచారణకు అభ్యంతరం లేదన్న అంశాన్ని అఫిడవిట్ రూపంలో దాఖలు చేయాలని ఏజీని హైకోర్టు ధర్మాసనం ఆదేశించింది.

కాగా, ఈ కేసులో 44 మంది ప్రతివాదులకు నోటీసులు జారీ చేయడంలో జాప్యం జరగడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. రిజిస్ట్రీపై విచారణ జరపాలని హైకోర్టు ఆదేశించింది. 13వ తేదీన నోటీసులు జారీ చేయమని చెప్తే 9వ తేదీ వరకు నోటీసులు ఎందుకు జారీ చేయలేదని రిజిస్ట్రీని ప్రశ్నించింది హైకోర్టు. అనంతరం ఈ కేసు విచారణను ఈనెల 29వ తేదీకి వాయిదా వేసింది హైకోర్టు.

ఇక ఏపీ ఫైబర్ గ్రిడ్ కేసులో పిటి వారెంట్ జారీ అంశంపై శుక్రవారం నాడు విజయవాడ ఏసీబీ కోర్టులో విచారణ జరిగింది. ఈ నెల 30వ తేదీ వరకు ఏపీ ఫైబర్ గ్రిడ్ కేసు పిటి వారెంట్ పై ఎలాంటి అరెస్ట్‌లు చేయవద్దని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఏసీబీ కోర్టులో మెమో దాఖలు చేశారు సీఐడీ తరఫున న్యాయవాదులు. ఈ కేసును డిసెంబర్ 1వ తేదీకి వాయిదా వేసింది ఏసీబీ కోర్టు. అలాగే ఏపి ఫైబర్ గ్రిడ్ కేసులో అక్రమాలకు పాల్పడ్డిన కేసులో అస్తులు అటాచ్‌మెంట్ చేయాలని ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు కాగా.. విచారించింది ఏసిబి కోర్టు. ఈ కేసుపై విచారణను కూడా 17వ తేదీకి వాయిదా వేసింది ఏసీబీ ధర్మాసనం.

Also Read:

అద్దంకిని కాదని సామేలుకు తుంగతుర్తి టికెట్.. ఆయన బ్యాక్‌గ్రౌండ్ ఏంటో తెలుసా?

మరో ట్విస్ట్ ఇచ్చిన బీజేపీ.. ఆ రెండు స్థానాల్లో అభ్యర్థులు మార్పు..

Advertisment
తాజా కథనాలు