AP : ప్రభాస్ ఫ్యాన్స్ కు ఏపీ సర్కార్ మరో శుభవార్త.. 'కల్కి' కోసం స్పెషల్ పర్మిషన్!

సినీ లవర్స్ కు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ‘కల్కి 2898AD’ సినిమాకు టికెట్ రేట్లు పెంచుకునే ఛాన్స్ తో పాటూ అదనంగా ఆరో షో వేసుకునేందుకు వెసలుబాటు కల్పించింది. ఇందుకు సంబంధించి ఏపీ ప్రభుత్వం తాజాగా అధికారిక ప్రకటన విడుదల చేసింది.

New Update
AP : ప్రభాస్ ఫ్యాన్స్ కు ఏపీ సర్కార్ మరో శుభవార్త.. 'కల్కి' కోసం స్పెషల్ పర్మిషన్!

AP Govt Gives Permission To Kalki 6th Show : టాలీవుడ్ పాన్ ఇండియా హీరో ప్రభాస్ నటించిన ‘కల్కి 2898AD’ మరికొద్ది గంటల్లో థియేటర్స్ లో సందడి చేయనున్న తరుణంలో సినీ లవర్స్ కు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఈ సినిమాకు టికెట్ రేట్లు పెంచుకునే ఛాన్స్ తో పాటూ అదనంగా ఆరో షో వేసుకునేందుకు వెసలుబాటు కల్పించింది. ఇందుకు సంబంధించి ఏపీ ప్రభుత్వం తాజాగా అధికారిక ప్రకటన విడుదల చేసింది. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.

కాగా ఏపీలో కల్కి టికెట్ ధరలు పెరిగిన సంగతి తెలిసిందే. సింగిల్ స్క్రీన్ థియేటర్లలో టికెట్ పై 75 రూపాయాలు.. మల్టీప్లెక్స్ లో టికెట్ పై 125 రూపాయాలు పెంచేందుకు కల్కి టీం కు ఏపీ ప్రభుత్వం అనుమతిచ్చింది. విడుదలైన రోజు అంటే జూన్ 27 నుంచి 14 రోజుల పాటు టికెట్ రేట్లు పెంచేందుకు అనుమతిచ్చింది.

Also Read : లగ్జరీ కారు కొన్న ‘సలార్’ నటుడు.. ఎన్ని కోట్లో తెలుసా?

అటు తెలంగాణ లోనూ కల్కి టికెట్ రేట్లు భారీగా పెరిగాయి. ఒక్కో టికెట్‌పై గరిష్ఠంగా రూ.200 పెంచుకునేందుకు ఇటీవల తెలంగాణ సర్కార్ అనుమతి ఇచ్చింది. సింగిల్‌ స్క్రీన్‌ థియేటర్లలో రూ.75, మల్టీప్లెక్స్‌ల్లో రూ.100 వరకు పెంచుకోవచ్చని పేర్కొంది. దీంతో పాటు ఈ నెల 27న ఉదయం 5.30 గంటల షోకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.

publive-image

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు