'సలార్' టికెట్ ధరల పెంపుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.. ఎంత పెంచారంటే

డిసెంబర్ 22న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ప్రభాస్ 'సలార్' సినిమా టికెట్ల ధరల పెంపుకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని థియేటర్లలో 10 రోజులపాటు అన్ని టికెట్లపై రూ.40 రూపాయలు పెంచుకునేందుకు అనుమతిచ్చింది.

'సలార్' టికెట్ ధరల పెంపుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.. ఎంత పెంచారంటే
New Update

స్టార్ హీరో ప్రభాస్ అప్ కమింగ్ మూవీ 'సలార్' టికెట్ల ధరల పెంపుపై ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన జారీ చేసింది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రెండు పార్టులుగా వస్తున్న ఈ మూవీ డిసెంబర్ 22న ప్రేక్షకుల ముందుకు రానుండగా సినిమా టికెట్ల ధరల పెంచాలంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని దర్శకనిర్మాతలు రిక్వెస్ట్ చేశారు. దీంతో మంగళవారం జగన్ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని థియేటర్లలో 10 రోజులపాటు రూ.40 రూపాయలు పెంచుకునేందుకు అనుమతిచ్చింది.

publive-image

యాక్షన్ ఎంటర్ టైనర్ గా రాబోతున్న మూవీలో పృథ్వీరాజ్ సుకుమారన్, శృతిహాసన్ ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా రీసెంట్ గా రిలీజ్ చేసిన ట్రైలర్ మూవీపై భారీ అంచనాలు పెంచేసింది. దీంతో టికెట్ల కోసం ఫ్యాన్స్ ఎగబడుతున్నారు. ఇప్పటికే పలు బుకింగ్ సెంటర్లలో భారీగా క్యూ కడుతున్నారు. ఈ క్రమంలో టికెట్ల కోసం బుకింగ్‌ కౌంటర్ల వద్ద తోపులాట ఘటనలు చోటుచేసుకోగా పలుచోట్ల ఫ్యాన్స్‌పై పోలీసుల లాఠీచార్జ్‌ చేశారు. హైదరాబాద్‌లో పలు థియేటర్ల వద్ద టికెట్లు అయిపోయాయని చెప్పడంతో ఫ్యాన్స్‌ నిరసన చేపట్టారు.

ఇది కూడా చదవండి : నాగార్జున అరెస్ట్ తప్పదా..? బిగ్ బాస్ పై హైకోర్టు లో పిటిషన్

ఇదిలావుంటే.. ఇప్పటికే ఏపీలో పది రోజుల పాటు రూ.40 పెంచుకునేందుకు అనుమతులు ఇచ్చినప్పటికీ మరో రూ.10 పెంచాలని డిస్ట్రిబ్యూటర్లు అడగటం విశేషం. కాగా తెలంగాణలో స్పెషల్ షోలకు అనుమతిని ఇచ్చారు. మొదటిరోజు మొత్తం ఆరు షోలు పడబోతున్నాయి. అలాగే కొన్ని సెలెక్టెడ్ చేసిన థియేటర్స్ లో తెల్లవారుజామున ఒంటిగంట షో కూడా వేయనున్నారు. ఇక తెలంగాణలో సింగిల్ స్క్రీన్స్ లో 250, 175, 100 రేట్లు, మల్టీఫెక్స్ ల్లో 370, 470 ధరతో టికెట్స్ నిర్ణయించారు. సాధారణ టికెట్ రేట్లుతో పోలిస్తే.. మల్టీఫెక్స్ ల్లో రూ.100, సాధారణ థియేటర్లలో రూ.55 పెంచుకునేందుకు అనుమతి ఇచ్చారు. తెలంగాణ థియేటర్ హక్కులను మైత్రీ మూవీ మేకర్స్ సొంతం చేసుకుంది.

#ap #prabhas #salar #tiket-price
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe