AP: వాలంటీర్లకు ఆ అలవెన్స్ రద్దు చేసిన ప్రభుత్వం!

ఏపీలో గత ప్రభుత్వం వాలంటీర్లకు ఇచ్చిన పేపర్‌ అలవెన్స్‌ను కూటమి ప్రభుత్వం రద్దు చేసింది. గత ప్రభుత్వం తమ పేపర్‌ సర్క్యూలేషన్‌ ను పెంచుకోవడానికే ఇలా అలవెన్స్‌ లు ఇచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు.

Ap Cabinet : నేడు తొలిసారి సమావేశం కానున్న ఏపీ కేబినేట్!
New Update

AP Volunteers: ఏపీలోని గత ప్రభుత్వం వాలంటీర్లు తప్పనిసరిగా దినపత్రికను కొనుగోలు చేయాలంటూ, అందుకుగానూ నెలకు రూ. 200 అలవెన్స్‌ కూడా ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఏపీలో తాజాగా ఏర్పడిన టీడీపీ కూటమి (TDP Alliance) ప్రభుత్వం ఇప్పుడా అలవెన్స్ ను (Newspaper Allowance) రద్దు చేసింది. పత్రిక కొనుగోలు ఉత్తర్వులను రద్దు చేస్తూ, తాజాగా మెమో జారీ చేసింది.

న్యూస్ పేపర్ కోసం ఎలాంటి చెల్లింపులు జరపవద్దని ఆదేశించింది. సాక్షిపేపర్‌ సర్క్యులేషన్ పెంచుకునేందుకు అప్పట్లో వైసీపీ (YCP) ప్రభుత్వం అలవెన్స్ ఇచ్చిందన్న ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతం ఏపీలో వాలంటీర్ల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఎన్నికల ముందు తమతో బలవంతంగా రాజీనామాలు చేయించారంటూ పెద్ద సంఖ్యలో వాలంటీర్లు టీడీపీ నేతలను కలిసి మొరపెట్టుకుంటున్నారు.

తమను విధుల్లోకి తీసుకోవాలని కోరుతున్నారు. కొందరు వాలంటీర్లు వైసీపీ నేతలపై పోలీసులకు ఫిర్యాదు కూడా చేయడంతో వారి పై కేసులు కూడా నమోదు అయ్యాయి.

Also Read: బాలరాముడి గర్భగుడిలోకి వర్షం నీరు!

#ycp #tdp #nda #ap-volunteers #paper-allawance
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe