Andhra Pradesh : ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌కు ఏపీ గవర్నర్ ఆమోదం

రూ.1.29లక్షల కోట్ల బడ్జెట్‌కు ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీజ్ ఆమోదం తెలిపారు. నాలుగు నెలల కాల పరిమితితో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ఆర్డినెన్సు జారీ చేశారు. కొత్త ప్రభుత్వం వచ్చినందున పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశ పెట్టడానికి మరికొంత సమయం అవసరం అని గెజిట్‌లో గవర్నర్‌ చెప్పారు.

Andhra Pradesh : ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌కు ఏపీ గవర్నర్ ఆమోదం
New Update

Vote On Account Budget : ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) శాసనసభలో ప్రవేశపెట్టనున్న ఓటాన్ బడ్జెట్‌కు గవర్నర్ అబ్దుల్ నజీజ్ (Abdul Najeeb) ఆర్డినెస్ జారీ చేశారు. రూ. 1.29 లక్షల కోట్లతో ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌కు గవర్నర్ ఆమోదం తెలిపారు. నాలుగు నెల కోసం ఈ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం కొత్తగా ఏర్పడడం...ఆర్ధిక శాఖ, ఇతర శాఖలతో నమన్వయం కుదరడానికి ఇంకా కొంత సమయం కావాల్సి ఉండడంతో ఈసారి ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు.

సెప్టెంబర్‌లో పూర్తి బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉంది. దాదాపు రూ.1.30లక్షల కోట్లతో ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ (Vote On Account Budget) కు ఆర్డినెన్స్‌ ఇచ్చింది. 40 విభాగాలకు చెందిన డిమాండ్లు, గ్రాంట్లకు ఆమోదం వచ్చేలా ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ఆర్డినెన్సు జీవో జారీ చేసింది. అన్నా క్యాంటీన్ల నిర్మాణం, రోడ్ల రిపేర్లు సహా కొన్ని అత్యవసర విభాగాలకు బడ్జెట్ లో కేటాయింపులు చేయనున్నారు.

ఇక ఈ బడ్జెట్‌లో జలవరుల కోసం ఎక్కువ కేటాయించనున్నారన తెలుస్తోంది. భారీ, మధ్య తరహా, చిన్న నీటి పారుదలకు రూ.13,308.50 కోట్లు పెట్టుబడి వ్యయంగా కేటాయించిందని సమాచారం. గత ఐదేళ్ళల్లో పూర్తికానివన్నీ ఇప్పుడు కంప్లీట్ చేసేందుకే వీటిని ఖర్చు పెట్టనుంది కొత్త ప్రభుత్వం. వీటితో పాటూ రోడ్ల మరమ్మత్తులకు రూ.1100 కోట్లు ఖర్చు అవుతుందని అధికారులు అంచనా వేశారు. ఆగస్టు 15 నుంచి అన్నా క్యాంటీన్లు మొదలవుతాయని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. దానికి సంబంధించిన ఏర్పాట్లను కూడా జరుగుతున్నాయి. ఇక వీటన్నింటతో పాటూ కేంద్ర ప్రభుత్వం (Central Government) అందించించే పథకాలకు మ్యాచింగ్ గ్రాంట్లకు నిధులు కేటాయించినట్టు సమాచారం. ఇప్పుడు ఓటాన్ బడ్జెట్‌కు ఆమోదం లభిస్తే కనుక ఒక ఏడాదిలో రెండు సార్లు దీనిని ప్రవేశపెట్టినట్టు అవుతుంది. రాష్ట్ర చరిత్రలోనే ఇదే మొదటిసారి కూడా అవుతుంది.

Also Read:Jammu-kashmir: వేడెక్కుతున్న ల‌డాఖ్-వేగంగా క‌రుగుతున్న గ్లేసియ‌ర్స్‌

#andhra-pradesh #vote-on-account-budget #governor
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe