Telangana Employees : ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో ఉన్న తెలంగాణ ఉద్యోగులను వెనక్కు పంపే ఏర్పాటు చేయాలని ఏపీ గవర్నమెంటు (AP Government) ఆర్డర్లు పాస్ చేసింది. రాష్ట్రం ఏర్పడిన తర్వాత నుంచి ఇక్కడ ఉంటున్న ఉద్యోగులను వారి స్వంత రాష్ట్రానికి పంపాలని చెప్పింది. దీనిలో భాగంగా మొత్తం 122 మంది తెలంగాణ స్థానికత కలిగిన నాన్ గెజిటెడ్ ఉద్యోగులను రిలీవ్ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణ ప్రభుత్వం నుంచి వచ్చిన అభ్యర్ధన మేరకు 122 మంది నాన్ గెజిటెడ్ ఉద్యోగులను తెలంగాణాకు రిలీవ్ చేసింది.
అయితే ప్రస్తుతం వేర్వేరు విభాగాల్లో పనిచేస్తున్న తెలంగాణ స్థానికత కలిగిన ఉద్యోగులను రిలీవ్ చేసే ముందు వారి నుంచి అంగీకారం తీసుకోవాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. వారికి ఇష్టమైతేనే వెనక్కు పంపాలని చెప్పింది. దాంతో పాటూ తెలంగాణకు రిలీవ్ అవుతున్న ఉద్యోగులు తమ కేడర్ లోని చివరి ర్యాంక్ లో మాత్రమే విధుల్లో చేరతారని ఆంధ్ర ప్రభుత్వం చెప్పింది. అందుకు సిద్ధపడే వారు తెలంగాణకు వెళ్ళాలని సూచించింది.
తెలంగాణ ఉద్యోగ సంఘం హర్షం..
ఏపీ గవర్నమెంట్ ఆర్డర్స్ మీద తెలంగాణ ఉద్యోగ సంఘం హర్షం వ్యక్తం చేసింది. తెలంగాణ ఉద్యోగుల రిలీవ్ చేయడంలో చొరవ చూపిన ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఉద్యోగ సంఘం ధన్యవాదాలు తెలిపింది. రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ కు చెందిన ఉద్యోగులు కొందరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పనిచేస్తూ ఎన్నో వ్యయ ప్రయాసలకు ఓరుస్తున్నారు. ఇప్పుడు వారిని రిలీవ్ చేయడం ఎంతో ఆనందంగా ఉందని చెప్పింది. అలాగే ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఉద్యోగులను కూడా రిలీఫ్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం (Telangana Government) కూడా ఉత్తర్వులు జారీ చేయాలని తెలంగాణ ఉద్యోగుల సంఘం కోరింది.
Also Read: Vinesh Phogat: వినేశ్ ఫోగాట్ కేసు మళ్ళీ వాయిదా..ఆగస్టు 16న తీర్పు