Violence : ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికల(Lok Sabha - Assembly Elections) పోలింగ్(Polling) నేపథ్యంలో నెలకొన్న హింసాత్మక ఘటనలపై సీఈసీ(CEC) కి నివేదిక అందింది. ప్రాథమిక విచారణ పూర్తిచేసి సీఈఓ కార్యాలయం నివేదిక పంపింది. ఐపీఎస్ అధికారి వినీత్ బ్రిజ్‌లాల్ నేతృత్వంలో సిట్(SIT) పని చేయనుంది. ఇందులో మొత్తం13 మంది సభ్యులు ఉన్నారు. దీనిపై రేపటిలోగా ఈసీకి పూర్తి నివేదిక ఇవ్వనున్నట్లు సమాచారం. పల్నాడు, తాడిపత్రి, తిరుపతిలోని ప్రతి ఘటనపై సిట్ నివేదించనుండగా.. దీని ఆధారంగా ఈసీ తదుపరి చర్యలు తీసుకోనుంది. ఇప్పటికే ప్రాథమిక విచారణ పూర్తిచేసి సీఈవో కార్యాలయం ఈసీకి సీట్ నివేదించినట్లు తెలుస్తోంది.
సిట్ సభ్యులుగా ఎవరెవరున్నారంటే..
1. ఏసీబీ ఎస్పీ రమాదేవి
2. ఏసీబీ అదనపు ఎస్పీ సౌమ్యలత
3. ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి (శ్రీకాకుళం)
4. సీఐడీ డీఎస్పీ శ్రీనివాసులు
5. ఏసీబీ డీఎస్పీ శ్రీనివాసరావు (ఒంగోలు)
6. ఏసీబీ డీఎస్పీ మనోహరాచారి (తిరుపతి)
7. వి.భూషణం (గుంటూరు రేంజ్ ఇన్‌స్పెక్టర్)
8. వెంకటరావు (విశాఖ ఇంటెలిజెన్స్ ఇన్‌స్పెక్టర్)
9. రామకృష్ణ (ఏసీబీ ఇన్‌స్పెక్టర్)
10. జి.ఎల్.శ్రీనివాస్ (ఏసీబీ ఇన్‌స్పెక్టర్)
11. మోయిన్ (ఒంగోలు పీటీసీ)
12. ప్రభాకర్ (అనంతపురం ఏసీబీ)
13. శివప్రసాద్ (ఏసీబీ ఇన్‌స్పెక్టర్)
Also Read : ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. 14 రైళ్లు రద్దు!