YV Subba Reddy On Container Issue: ఎన్నికల సమయంలో తాడేపల్లిలోని సీఎం జగన్ (CM Jagan) నివాసానికి కంటైనర్ వెళ్లడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. కంటైనర్ లో భారీ మొత్తంలో డబ్బు తరలిస్తున్నారని.. అందులో భారీగా డ్రగ్స్ ఉన్నాయని ప్రతిపక్షలు జోరుగా ప్రచారం చేస్తున్నాయి. జరుగుతున్న ప్రచారానికి చెక్ పెట్టారు వైసీపీ నేత వైవీ సుబ్బారెడ్డి. కంటైనర్ లో అసలేముంది అనే దానిపై వివరణ ఇచ్చారు.
ALSO READ: ఆసక్తికరంగా పులివెందుల రాజకీయం .. ఎన్నికల ప్రచారంలోకి అటు భారతి.. ఇటు షర్మిల..!
వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. సీఎం క్యాంప్ ఆఫీస్ లో ఉన్న ప్రభుత్వ శాఖలకు అవసరమైన ఫర్నీచర్ (Furniture) కంటైనర్ లో వచ్చిందని అని అన్నారు. అసలు విషయం తెలియక ప్రతిపక్షలు రాద్దాంతం చేస్తున్నాయి అని అన్నారు. వైజాగ్ పోర్ట్ కు వచ్చిన డ్రగ్స్ కంటైనర్ లోకేష్ బంధువుల దే అని ఆరోపించారు. అందుకే ఏ కంటైనర్ చూసినా వారికి అనుమానం వస్తుందని చురకలు అంటించారు. దొడ్డి దారిలో మంత్రి అయిన లోకేష్ కు (Nara Lokesh) ఇంతకుమించి సంస్కారం ఉంటుందని అనుకోలేం అని ఎద్దేవా చేశారు.
బీసీల అడ్డా అయిన ఉత్తరాంధ్ర లో ఎంపి అభ్యర్థులుగా ఓసీ లు అయిన శ్రీ భరత్, సీఎం రమేష్ లకు టికెట్లు ఇచ్చి కూటమి ఏం మెసేజ్ ఇచ్చిందో చెప్పాలని డిమాండ్ చేశారు. వైసీపీ ఉత్తరాంధ్ర ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా స్థానిక బీసీ లకే పోటీ చేసే అవకాశం ఇచ్చిందని అన్నారు. ఉత్తరాంధ్ర లో ఇతర ప్రాంత ఎంపీ ఓసీ అభ్యర్థుల ఆధిపత్యాన్ని ప్రచారం లో ఎండగడతాం అని ఆయన హెచ్చరించారు.