YV Subba Reddy: సీఎం ఆఫీసులోకి వచ్చిన కంటైనర్.. ఏముందో చెప్పిన వైవీ సుబ్బారెడ్డి! AP: తాడేపల్లిలోని సీఎం జగన్ నివాసానికి కంటైనర్ వెళ్లడం జరుగుతున్న చర్చలకు చెక్ పెట్టారు వైవీ సుబ్బారెడ్డి. సీఎం క్యాంప్ ఆఫీస్‌లో ఉన్న ప్రభుత్వ శాఖలకు అవసరమైన ఫర్నీచర్ కంటైనర్‌లో వచ్చిందని క్లారిటీ ఇచ్చారు. ప్రతిపక్షలు తమపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నాయి అన్నారు. By V.J Reddy 27 Mar 2024 in ఆంధ్రప్రదేశ్ గుంటూరు New Update షేర్ చేయండి YV Subba Reddy On Container Issue: ఎన్నికల సమయంలో తాడేపల్లిలోని సీఎం జగన్ (CM Jagan) నివాసానికి కంటైనర్ వెళ్లడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. కంటైనర్ లో భారీ మొత్తంలో డబ్బు తరలిస్తున్నారని.. అందులో భారీగా డ్రగ్స్ ఉన్నాయని ప్రతిపక్షలు జోరుగా ప్రచారం చేస్తున్నాయి. జరుగుతున్న ప్రచారానికి చెక్ పెట్టారు వైసీపీ నేత వైవీ సుబ్బారెడ్డి. కంటైనర్ లో అసలేముంది అనే దానిపై వివరణ ఇచ్చారు. ALSO READ: ఆసక్తికరంగా పులివెందుల రాజకీయం .. ఎన్నికల ప్రచారంలోకి అటు భారతి.. ఇటు షర్మిల..! వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. సీఎం క్యాంప్ ఆఫీస్ లో ఉన్న ప్రభుత్వ శాఖలకు అవసరమైన ఫర్నీచర్ (Furniture) కంటైనర్ లో వచ్చిందని అని అన్నారు. అసలు విషయం తెలియక ప్రతిపక్షలు రాద్దాంతం చేస్తున్నాయి అని అన్నారు. వైజాగ్ పోర్ట్ కు వచ్చిన డ్రగ్స్ కంటైనర్ లోకేష్ బంధువుల దే అని ఆరోపించారు. అందుకే ఏ కంటైనర్ చూసినా వారికి అనుమానం వస్తుందని చురకలు అంటించారు. దొడ్డి దారిలో మంత్రి అయిన లోకేష్ కు (Nara Lokesh) ఇంతకుమించి సంస్కారం ఉంటుందని అనుకోలేం అని ఎద్దేవా చేశారు. బీసీల అడ్డా అయిన ఉత్తరాంధ్ర లో ఎంపి అభ్యర్థులుగా ఓసీ లు అయిన శ్రీ భరత్, సీఎం రమేష్ లకు టికెట్లు ఇచ్చి కూటమి ఏం మెసేజ్ ఇచ్చిందో చెప్పాలని డిమాండ్ చేశారు. వైసీపీ ఉత్తరాంధ్ర ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా స్థానిక బీసీ లకే పోటీ చేసే అవకాశం ఇచ్చిందని అన్నారు. ఉత్తరాంధ్ర లో ఇతర ప్రాంత ఎంపీ ఓసీ అభ్యర్థుల ఆధిపత్యాన్ని ప్రచారం లో ఎండగడతాం అని ఆయన హెచ్చరించారు. సీఎం కార్యాలయంలో కంటైనర్ వివాదంపై వీడిన మిస్టరీ అది కంటైనర్ కాదని ప్యాంట్రీ కారు అని అయితే ఆ వాహనం సీఎం బస్సు యాత్ర నేపథ్యంలో ఆహారాన్ని తయారుచేసుకునే పాంట్రీ వ్యాన్ అని తేల్చిన అధికారులు. pic.twitter.com/LtiEUyixLt — Telugu Scribe (@TeluguScribe) March 27, 2024 #ap-elections-2024 #cm-jagan #yv-subba-reddy మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి