YCP MLA To Join Janasena : ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి విజయం సాధించి అధికారంలో ఉండాలని అనుకున్న సీఎం జగన్(CM Jagan) కు సొంత పార్టీ నేతలే ఎన్నికల ముందు షాక్ లు ఇస్తున్నారు. వైసీపీకి రాజీనామా చేసి టీడీపీ, జనసేన(Janasena) లో చేరుతున్నారు. అయితే, మరోసారి జగన్ కు వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేల నుంచి షాక్ తప్పదా? అంటే దీనికి అవును అనే సమాధానాలు వినిపిస్తున్నాయి. తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు శుక్రవారం రాత్రి భేటీ అయ్యారు. మూడు రోజుల పర్యటనలో భాగంగా కాకినాడలో పవన్ కళ్యాణ్ బస చేశారు. వైసీపీ ఎమ్మెల్యే చంటిబాబు రాత్రి 10 గంటల సమయంలో పవన్ కళ్యాణ్ వద్దకు వచ్చారు. పవన్, నాదెండ్ల మనోహర్ తో సుమారు గంట పాటు చర్చించినట్లు సమాచారం. కాకినాడ జిల్లాలో పలు అసెంబ్లీ స్థానాల్లో సిటింగ్ లను వైసీపీ అధిష్టానం మారుస్తోందన్న చర్చ నడుస్తోంది. ఈ జాబితాలో జగ్గంపేట కూడా ఉందని సమాచారం.
ALSO READ: తిరుమలలో చిరుత సంచారం.. భక్తులకు టీటీడీ హెచ్చరికలు!
ఈ సారి చంటిబాబుకు అవకాశం లేదనే సంకేతాలు రావడంతో ఆయన వర్గీయులు సీఎం జగన్ తీరుపై నిరసన తెలిపారు. కొందరు పార్టీకి, పదవులకు రాజీనామా చేశారు. ఎమ్మెల్యే సైతం తనతో ఉన్నవారి మనోభావాలు దెబ్బ తినకుండా ప్రవర్తిస్తే బాగుంటుందని, లేదంటే భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తానని ఇటీవల అధిష్ఠానాన్ని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో పవన్ తో చంటిబాబు(Chanti Babu) భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే ఆయన కూడా త్వరలో వైసీపీకి రాజీనామా చేసి జనసేన లేదా టీడీపీలో చేరుతారనే చర్చ ఏపీ రాజకీయాల్లో నెలకొంది. జనసేన ఛీఫ్ పవన్ కళ్యాణ్ తో భేటీ కావడంపై వైసీపీ ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు ఏమని సమాధానం చెబుతారో వేచి చూడాలి.
ALSO READ: ఉచిత బస్సు ప్రయాణం.. రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం