TS RTC : ఉచిత బస్సు ప్రయాణం.. రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్టీసీ బస్సుల్లో రద్దీ తగ్గించేందుకు ఈ రోజు 80 బస్సులను మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించనున్నారు. అదే విధంగా 400 కోట్లతో 1050 డీజిల్ బస్సులు కొనుగోలుకు నిర్ణయం తీసుకుంది. 2024 మార్చి నాటికి అందుబాటులోకి రానున్నాయి. By V.J Reddy 30 Dec 2023 in Latest News In Telugu ఆదిలాబాద్ New Update షేర్ చేయండి Free Bus Scheme : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకానికి మహిళల నుంచి మంచి స్పందన లభించిన పురుషులకు మాత్రం చాలా ఇబ్బందిగా మారింది. ఈ పథకం అమలు చేయడం ద్వారా ఆర్టీసీ బస్సుల్లో రద్దీ పెరిగింది. సరిపడా బస్సులు అందుబాటులో లేక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో టీఎస్ ఆర్టీసీ(TSRTC) కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా మరికొన్ని బస్సులను ప్రారంభించనుంది. తెలంగాణలో ఫ్రీ బస్ (FREE BUS SCHEME) కష్టాలకు చెక్ పెట్టేందుకు కసరత్తు చేసింది. ఈ రోజు కొత్తగా టీఎస్ ఆర్టీసీ 80 బస్సులను ప్రారంభించనుంది. ఎన్టీఆర్ మార్గ్ లోని అంబెడ్కర్ విగ్రహం వద్ద ప్రారంభ కార్యక్రమం ఏర్పాటు చేశారు అధికారులు. కొత్త బస్సులను మంత్రి పొన్నం ప్రభాకర్(Ponnam Prabhakar) ప్రారంభించనున్నారు. 30 ఎక్స్ప్రెస్, 30 రాజధాని ఏసీ, 20లహరి స్లీపర్ కమ్ సీటర్ (నాన్ ఏసీ బస్సులు) లను మంత్రి పొన్నం పచ్చ జెండా ఊపి ప్రారంభించనున్నారు. *మరిన్ని కొత్త బస్సులు వచ్చేస్తున్నాయ్!* *అందుబాటులోకి కొత్త ఎక్స్ ప్రెస్, రాజధాని ఏసీ, లహరి స్లీపర్ కమ్ సీటర్ బస్సులు* *అంబేద్కర్ విగ్రహం వద్ద రేపు ప్రారంభం* ప్రయాణికులకు మెరుగైన, నాణ్యమైన సేవలు అందించేందుకు #TSRTC నిరంతరం కృషి చేస్తోంది. రవాణా రంగంలో వస్తోన్న మార్పులను… pic.twitter.com/zUPinbBS6I — VC Sajjanar - MD TSRTC (@tsrtcmdoffice) December 29, 2023 ALSO READ: ప్రజాపాలన రెండో రోజు @8,12,862 దరఖాస్తులు ప్రయాణికులకు టీఎస్ఆర్టీసీ న్యూఇయర్ గిఫ్ట్.. మహాలక్ష్మి పథకంతో మహిళలకు లబ్ధి చేకూరిన.. ప్రయాణికులకు ఇబ్బందులు తగ్గకపోవడంతో టీఎస్ ఆర్టీసీ ప్రయాణికులకు న్యూఇయర్ గిఫ్ట్ ఇచ్చేందుకు సిద్ధమైంది. 400 కోట్లతో 1050 డీజిల్ బస్సులు కొనుగోలుకు నిర్ణయం తీసుకుంది. 400 ఎక్స్ప్రెస్ బస్సులు, 512 పల్లె వెలుగు, 92 లహరి స్లీపర్ కమ్ సీటర్, 56 ఏసీ రాజధాని బస్సులు.. డీజిల్ బస్సులకు అదనంగా 1040 ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలు చేసేందుకు కసరత్తు చేస్తుంది. హైదరాబాద్లో 540 సిటీ బస్సులు, ఇతర ప్రాంతాలకు మరో 500 ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి తేనుంది. 2024 మార్చి నాటికి అందుబాటులోకి కొత్త బస్సులు వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. ALSO READ: మార్చి 18 నుంచి టెన్త్ పరీక్షలు.. నేడు ప్రకటన? #ponnam-prabhakar #free-bus-scheme #tsrtc-new-buses #cm-revanth-reddy సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి