Pawan Kalyan: టీడీపీ మాజీ ఎమ్మెల్యే రామాంజనేయులు జనసేన పార్టీలో చేరారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.అనంతరం పొత్తులపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. పొత్తులకు వెళ్ళడానికి ఒక కీలక వ్యక్తి కారణమని అన్నారు. రాజకీయాల్లో యుద్ధమే తప్ప బంధుత్వం ఉండదని తెలిపారు. గత ఎన్నికల్లో బంధుత్వాలతో సంకెళ్లు వేశారని అన్నారు.నిర్ణయం తీసుకున్నాక ప్రత్యర్థులే ఉంటారని తెలిపారు. గత ఎన్నికల్లో భీమవరంలో తాను గెలిచి ఉంటే లెక్క వేరే ఉండేది అని అన్నారు. భీమవరంలో కాకుండా పులివెందులలో పోటీ చేసి ఓడిపోయుంటే బాగుండేది అని అన్నారు. ఎమ్మెల్యేగా ఓడిపోయిన తనను ప్రజలు గుండేల్లో పెట్టుకున్నారని అన్నారు. భీమవరం ఇప్పుడు ఒక రౌడీ చేతిలోకి వెళ్లిపోయిందని మండిపడ్డారు.
ALSO READ: గీతాంజలి సూసైడ్.. సీఎం జగన్ మాస్ వార్నింగ్
వైసీపీ వస్తే చీకటే...
రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో మరో సారి వైసీపీ అధికారంలోకి వస్తే ఆంధ్ర ప్రదేశ్ చీకట్లోకి పోతుందని అన్నారు పవన్ కళ్యాణ్. ఒక దళితుడిని చంపిన వ్యక్తి స్వేచ్ఛగా బయట తిరుగుతున్నదని.. నేరస్థులు ఉన్న పార్టీ వైసీపీ అని విమర్శించారు. తనకు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రజల భవిష్యత్ ముఖ్యమని.. అందుకే కుటుంబాన్ని వదులుకొని రాజకీయాల్లోకి వచ్చానని అన్నారు. రానున్న ఎన్నికల్లో బీజేపీ, జనసేన, టీడీపీ కలిసి 175 అసెంబ్లీ స్థానాల్లో, 25 ఎంపీ స్థానాల్లో పోటీ చేస్తాయని పేర్కొన్నారు. త్వరలోనే ఉమ్మడి అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తామని తెలిపారు.
వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్..
వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ సాధ్యం చేసి చూపిస్తాం అని అన్నారు పవన్ కళ్యాణ్. ఈ పొత్తు కోసం ఎన్నో త్యాగాలు చేయడానికి సిద్ధమన్నారు. ఇది తన కోసం కాదు రాష్ట్రం కోసం, యువత కోసమే అని అన్నారు. ప్రజల కోసం నాలుగు సీట్లు తగ్గించుకుంటే ఏదో ప్రచారం చేస్తున్నారు. అరాచక, అవినీతి పాలన ను తరిమి కొట్టడానికి సిద్దం గా ఉండండి అని రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ ఎన్నికలలో ఐడియాలజీ, స్ట్రాటజీ తనకు వదిలేయండి అని కోరారు. తనను అక్కున చేర్చుకున్న భీమవరం ప్రజలను మరువను అని అన్నారు. త్వరలోనే భీమవరం లో అందరినీ కలుస్తానని మాట ఇచ్చారు.