Chandrababu: అందుకే మా పొత్తు.. చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

ఏపీలో పొత్తులపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీ బంగారు భవిష్యత్ కోసమే రానున్న ఎన్నికల్లో జనసేన-టీడీపీ-బీజేపీ కలిసి పోటీ చేయాలని భావించి పొత్తు పెట్టుకున్నామని అన్నారు. పొత్తు పెట్టుకోవడం వల్ల ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా ఉంటుందని పేర్కొన్నారు.

Chandrababu: అందుకే మా పొత్తు.. చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
New Update

TDP Chief Chandrababu: టీడీపీ అధినేత చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ఆంధ్ర ప్రదేశ్ భవిష్యత్ కోసమే ముందుకు వెళ్తున్నామని.. రాష్ట్రాన్ని కాపాడేందుకే జనసేన, బీజేపీ పార్టీలతో పొత్తు పెట్టుకున్నామని అన్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా ఉండేందుకు ఈ పొత్తు అని అన్నారు. పొత్తులో భాగంగా కొందరికి సీట్లు ఇవ్వలేక పోయామని పేర్కొన్నారు. టికెట్ రాని వారు అసంతృప్తి చెందొద్దు అని.. భవిష్యత్ లో అందరికి న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు. రానున్న అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి గెలుపే లక్ష్యంగా అందరు కలిసి పని చేయాలని పిలుపునిచ్చారు. ప్రతి అభ్యర్థి గెలవాలనే లక్ష్యంతోనే అభ్యర్థుల ఎంపిక జరిగిందని అన్నారు.

ALSO READ: వైసీపీ ఎమ్మెల్యేపై కేసు నమోదు

టెర్రరిస్టుల్ల వ్యవహరిస్తున్నారు..

వైసీపీ నేతలు టెర్రరిస్టుల తరహాలో వ్యవహరిస్తున్నారని అన్నారు చంద్రబాబు. వైసీపీకి చట్టాలు వర్తించవా? అని ప్రశ్నించారు. వివేకా హత్య కేసులో ఎంపీ అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయలేక సీబీఐ తిరిగి వెళ్లిపోయిందని విమర్శించారు. సీబీఐ అధికారులపైనే కేసు పెట్టిన ఘనత వైసీపీ నాయకులది అని అన్నారు.

డ్రగ్స్ అడ్డాగా ఏపీ..

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాన్ని డ్రగ్స్ కు అడ్డాగా వైసీపీ ప్రభుత్వం మార్చిందని ఫైర్ అయ్యారు. తప్పు చేసి ప్రతిపక్షాలపై నెట్టుతున్నారని ఫైర్ అయ్యారు. గత ఐదు ఏళ్లలో ఏ ఒక్క రోజుకూడా సీఎం జగన్ డ్రగ్స్ కట్టడిపై రివ్యూ మీటింగ్ తీసుకోలేదని విమర్శించారు. గంజాయి, డ్రగ్స్ పై మొదటి టీడీపీ పోరాడుతుందని పేర్కొన్నారు. గంజాయి పై పోరాడుతుంటే టీడీపీ పార్టీ ఆఫీసులపై వైసీపీ నేతలు దాడి చేశారని మండిపడ్డారు. విశాఖ డ్రగ్స్ తో వైసీపీ ప్రభుత్వానికి సంబంధం ఉందని చంద్రబాబు ఆరోపించారు. బ్రెజిల్ నుంచి డ్రగ్స్ కంటెనర్ విశాఖకు వచ్చిందని అన్నారు. బ్రెజిల్ ప్రెసిడెంట్ గెలవగానే ఎంపీ విజయసాయి రెడ్డి ట్వీట్ చేశారని గుర్తు చేశారు. ఐదేళ్లుగా ఏపీలో డ్రగ్స్ ను వైసీపీ ప్రభుత్వం పెంచి పోషించిందని ధ్వజమెత్తారు.

#chandrababu #tdp #ap-elections-2024 #ycp #cm-jagan
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe