YS Sharmila: ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో సీఎం జగన్ కు షాకుల మీద షాకులు ఇస్తున్నారు ఏపీ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. వైసీపీ నుంచి కాంగ్రెస్ లో చేరికలు జోరుగా సాగుతున్నాయి. తాజాగా పోలవరం నియోజక వర్గంలో వైసీపీకి రాజీనామ చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు కీలక మహిళా నేత దువ్వెల సృజన. ఆమెకు వైఎస్ షర్మిలా రెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అలాగే సంతనూతల పాడు మాజీ ఎమ్మెల్యే ధార సాంబయ్య కుమార్తె ధార పద్మజ ఇవ్వాళ కాంగ్రెస్‌లో చేరారు.
చింతలపూడి వైసీపీ ఎమ్మెల్యే జంప్..
చింతలపూడి ఎమ్మెల్యే ఉన్నమట్ల ఎలిజా(Vunnamatla Eliza) వైసీపీ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరారు. వైఎస్ షర్మిల ఆయనకు కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఇప్పటికి వరకు అభ్యర్థులను ప్రకటించని షర్మిల.. ఇతర పార్టీల నుంచి నేతలను తమ పార్టీలో చేర్చుకొని అప్పుడు అభ్యర్థులను ప్రకటించాలని ఆలోచనలు ఉన్నట్లు తెలుస్తోంది. ఏపీలో చలనం లేని కాంగ్రెస్ పార్టీ నుంచి అసెంబ్లీ కనీసం 10 మంది ఎమ్మెల్యేలను, పార్లమెంట్ కు 5 మంది కాంగ్రెస్ ఎంపీలను పంపాలని షర్మిల వ్యూహాలు రచిస్తున్నారు. మరి షర్మిల రాకతోనైనా ఏపీలో కాంగ్రెస్ బ్రతికి బయటపడుతుందా? లేదా? అనేది వేచి చూడాలి.