/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/pk-1-jpg.webp)
Pawan Kalyan Contesting From Pithapuram: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారని జరుగుతున్న చర్చకు తెర పడింది. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పిఠాపురం నుంచి తాను పోటీ చేస్తున్నట్లు స్వయంగా పవన్ కళ్యాణ్ ప్రకటించారు. గత ఎన్నికల్లో భీమవరం, గాజువాక రెండు స్థానాల్లో పోటీ చేసి ఓటమి చెందారు పవన్. తనకు ఎంపీగా కంటే ఎమ్మెల్యేగా పోటీ చేయాలని ఉందని ఆయన అన్నారు. తనను ఎంపీ గా కూడా పోటీ చేయాలనీ చంద్రబాబు, బీజేపీ పెద్దలు కోరుతున్నారని పేర్కొన్నారు. తనకు ఇప్పుడు ఎంపీగా పోటీ చేయాలనే ఆలోచలన లేదని తేల్చి చెప్పారు.
కాకినాడ నుంచి ఎంపీగా..
గత కొన్ని రోజులుగా పవన్ కళ్యాణ్ ఎంపీ గా పోటీ చేస్తారనే ప్రచారం రాష్ట్ర రాజకీయాల్లో జోరుగా సాగింది. కాకినాడ నుంచి ఎంపీ గా పవన్ కళ్యాణ్ పోటీ చేయనున్నట్లు చర్చ జరిగింది. తాజాగా పవన్ కళ్యాణ్ తనకు ఎంపీ గా పోటీ చేయాలనే ఉద్దేశం లేదని చెప్పారు. తనకు ఎంపీ గా కంటే ఎమ్మెల్యేగా పోటీ చేయాలనీ ఉందని అన్నారు. ఈ క్రమంలో ఎంపీ గా పవన్ పోటీ చేస్తారనే చర్చకు చెక్ పడింది. అయితే.. ఒకవేళ పొత్తులో భాగంగా పెద్దలు చెబితే తాను రానున్న ఎన్నికల్లో రెండు స్థానాల్లో పోటీ చేస్తానని పవన్ కళ్యాణ్ తెలిపారు. ఎమ్మెల్యే, ఎంపీ స్థానాల్లో పోటీ చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నానని అన్నారు. ఈ నేపథ్యంలో ఒకవేళ ఎంపీ గా పవన్ కళ్యాణ్ పోటీ చేస్తే ఏ పార్లమెంట్ స్థానంలో పోటీ చేస్తారనే చర్చ నెలకొంది.
ALSO READ: టీడీపీకి బిగ్ షాక్.. మాజీ ఎమ్మెల్యే రాజీనామా
కేంద్రమంత్రిగా పవన్..
ఎన్డీయే కూటమిలో సభ్యుడిగా పవన్ కళ్యాణ్ కు బీజేపీ బంపర్ ఆఫర్ ఇచ్చినట్టు తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ ను రానున్న ఎన్నికల్లో ఎంపీ గా పోటీ చేయాలనీ బీజేపీ పెద్దలు కోరుతున్నట్లు సమాచారం. లోక్ సభ ఎన్నికల్లో పవన్ ఎంపీ గా పోటీ చేసి గెలిస్తే కేంద్ర మంత్రిని చేయాలని బీజేపీ భావిస్తున్నట్లు రాజకీయాల్లో చర్చ జోరందుకుంది. అయితే.. పవన్ కళ్యాణ్ ఎంపీ గా పోటీ చేస్తారా?,.. ఎంపీ గా పవన్ గెలిస్తే కేంద్ర మంత్రి పదవి వస్తుందా అనేది వేచి చూడాలి.