Pawan Kalyan : పవన్ పోటీ చేసే స్థానంపై ఉత్కంఠ..ఈ సారి కూడా అక్కడి నుండే పోటీ చేస్తారా?

టీడీపీ, జనసేన పొత్తులో పవన్‌ ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే ఉత్కంఠ నెలకొంది. జనసేనకు ఇచ్చిన 24 సీట్లలో కేవలం 5 చోట్ల అభ్యర్థులను మాత్రమే ప్రకటించారు. మిగిలిన 19 సీట్లలో పవన్‌ ఎక్కడి నుంచి బరిలో దిగుతారోనని ఆసక్తి కనిపిస్తోంది.

New Update
Pawan Kalyan : పవన్ పోటీ చేసే స్థానంపై ఉత్కంఠ..ఈ సారి కూడా అక్కడి నుండే పోటీ చేస్తారా?

Janasena Chief Pawan Kalyan : టీడీపీ-జనసేన(TDP-Janasena) అభ్యర్థుల మొదటి జాబితా విడుదలైన సంగతి తెలిసిందే. అయితే, తొలి జాబితాలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎక్కడ నుండి పోటీ చేస్తారనే విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు. పొత్తులో ఇంకా పవన్‌ సీటు ఖరారు కానట్లు తెలుస్తోంది. గతంలో భీమవరం, గాజువాక నుంచి పోటీ చేసిన పవన్..ఈ సారి కూడా రెండు సీట్ల నుంచి పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతుంది.

Also Read: వైసీపీకి ఎంపీ రఘురామ కృష్ణంరాజు రాజీనామా

2019 ఎన్నికల్లో జనసేనాని పవన్ కల్యాణ్(Pawan Kalyan) భీమవరంతో పాటుగా గాజువాక(Gajuwaka) నుంచి పోటీ చేసి ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఈ రెండింటిలో ఒక స్థానం నుంచి తిరిగి పోటీ చేస్తారనే చర్చ కు జరిగింది. అంతేకాదు పవన్ ఈసారి రాయలసీమ నుంచి కూడా పోటీ చేయాలని బాబు సూచించారని వార్తలు వినిపించాయి. దీంతో ఈ సారి గోదావరి జిల్లాలతో పాటుగా రాయలసీమ నుంచి పోటీ చేస్తారనే ప్రచారం కూడా సాగింది. అయితే, ఈ ఎన్నికల్లో మరోసారి భీమవరం నుంచి పవన్ పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే, ఇది ఎంత వరకు నిజమో తెలియాల్సి ఉంది.

 

Also Read: టీడీపీ-జనసేన ఫస్ట్ లిస్ట్ రిలీజ్..!

పొత్తులో భాగంగా జనసేనకు 24 సీట్లు ఇవ్వగా.. మొదటి లిస్ట్ లో కేవలం 5 చోట్ల అభ్యర్థులను మాత్రమే ప్రకటించారు. ఇక మిగిలిన 19 సీట్లలో జనసేనాని పవన్‌ ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే ఉత్కంఠ నెలకొంది. అంతేకాకుండా జనసేనకు ఇచ్చిన 3 ఎంపీ సీట్లల్లోనూ ఎవరు పోటీ చేస్తారనే దానిపై ఇప్పటికి క్లారిటీ లేదు. నాగబాబు ఎంపీగా పోటీ చేస్తారా? లేదంటే అసెంబ్లీకి పోటీ చేస్తారా? అనేది కూడా ఆసక్తి నెలకొంది. ఉభయ గోదావరిలోనూ జనసేనకు ఎన్ని కేటాయించారనే దానిపై సస్పెన్స్‌ కొనసాగుతుంది. ఈ రెండు జిల్లాల్లో ప్రస్తుతానికి రాజానగరం, కాకినాడ రూరల్ అభ్యర్థులను మాత్రమే ప్రకటించారు.

Advertisment
తాజా కథనాలు