AP Grama Volunteers: టార్గెట్ చంద్రబాబు.. కుప్పంలో భారీగా వాలంటీర్ల రాజీనామాలు!

కుప్పంలో సీఎం జగన్‌కు మద్దతుగా 384 మంది వాలంటీర్లు మూకుమ్మడిగా రాజీనామా చేశారు. రాజీనామా పత్రాలను ఎంపీడీవోకు అందజేశారు. కుప్పంలో వైసీపీ అభ్యర్థి భారత్‌ను గెలిపిస్తామని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

New Update
Chandrababu: చంద్రబాబుకు బిగ్ షాక్.. ఈసీ చర్యలు!

AP Grama Volunteers: ఎన్నికల వేళ ఏపీలో కొందరు వాలంటీర్లు కీలక నిర్ణయం తీసుకున్నారు. సీఎం జగన్ కు మద్దతుగా పెద్దఎత్తున వాలంటీర్లు తమ ఉద్యోగాలకు రాజీనామా చేస్తున్నారు. తాజాగా కుప్పంలో చంద్రబాబుకు షాక్ ఇచ్చారు. 384 మంది వాలంటీర్లు మూకుమ్మడిగా రాజీనామా చేశారు. రాజీనామా పత్రాలను ఎంపీడీవోకు అందజేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఏపీలో మరోసారి జగన్ సీఎం అవుతారని.. అప్పుడు తమను తిరిగి విధుల్లో చేర్చుకుంటారని ధీమా వ్యక్తం చేశారు.

ALSO READ: చంద్రబాబుకు ఫ్రస్ట్రేషన్ ఎక్కువైంది.. సజ్జల హాట్ కామెంట్స్

ఈ ఎన్నికల్లో కుప్పంలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి భారత్ ను గెలిపిస్తామని వారు పేర్కొన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం వాలంటీర్లను వాడుకోవద్దని ఇచ్చినా  ఇచ్చిన ఆదేశాల వల్ల పెన్షన్ దారులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. మరి కొన్ని చోట్ల పెన్షన్ తీసుకోడానికి గ్రామ సచివాలయానికి వెళ్లిన వృద్దులు వడ దెబ్బ తగిలి చనిపోయారు. అయితే.. టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు ఇవ్వడం వల్లే ఏపీలో పెన్షన్ పంపిణీకి ఇబ్బంది కలిగిందని వైసీపీ ఆరోపిస్తోంది.

ఎన్నికల సమయంలో చంద్రబాబుకు పెన్షన్ల పంపిణీ ఇష్యూ పెద్ద తలనొప్పిగా మారిందనే చెప్పాలి. మరో వైపు చంద్రబాబు మాత్రం వైసీపీ చేస్తున్న ప్రచారాన్ని ఖండించారు. ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు సీఎం జగన్ చేస్తున్న నాటకాలు అని మండిపడ్డారు. తాము పెన్షన్ల పంపిణీ ఆపివేయాలని ఈసీకి ఫిర్యాదు చేయలేదని క్లారిటీ ఇచ్చారు. మరి ఈ పెన్షన్ల పంచాయతీ జగన్ కు లబ్ధి చేస్తుందా? లేదా చంద్రబాబుకు గెలుపుకు అడ్డం పడుతుందా? అనేది ఎన్నికల ఫలితాల వరకు వేచి చూడాల్సిందే.

Advertisment
తాజా కథనాలు