TDP Leader Devineni Uma: ఆంధ్ర ప్రదేశ్ లో మరి కొన్ని నెలల్లో ఎన్నికలు (AP Elections) జరగనున్న వేళ రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. నాయకుల మధ్య మాటల యుద్ధం చెలరేగిపోతోంది. తాజాగా సీఎం జగన్ (CMJagan) పై విమర్శల దాడికి దిగారు టీడీపీ (TDP) నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు(Devineni Uma Maheswara Rao). విజయవాడలో కేశినేని శివనాథ్ (Kesineni Sivanath) ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిభిరం ప్రారంభోత్సవ వేడుకుల్లో పాల్గొన్న ఆయన సీఎం జగన్ పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో వైద్య రంగం పూర్తిగా చెడిపోయిందని.. జగన్ ప్రభుత్వంలో అన్నీ వైఫల్యాలే అని అన్నారు. జగన్ ఆరోగ్య శ్రీ ని అనారోగ్య శ్రీ చేశాడని సెటైర్లు వేశారు. జగన్ ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయని అన్నారు.
ALSO READ: కాంగ్రెస్ 6 గ్యారెంటీలు.. ‘కాంగ్రెస్ 420 హామీలు’ పేరుతో బీఆర్ఎస్ సంచలన బుక్లెట్
దేవినేని ఉమా మీడియాతో మాట్లాడుతూ.. విజయవాడ పార్లమెంట్ పరిధిలోని అన్ని నియోజకవర్గాల్లో కేశినేని శివనాథ్ ఉచిత మెడికల్ క్యాంపులు నిర్వహించడం సంతోషకరమని పేర్కొన్నారు. బుధవారం నాడు ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం కొండపల్లి మున్సిపాలిటీ ఇబ్రహీంపట్నం పార్టీ కార్యాలయంలో ఉచిత కళ్ళజోళ్ళ పంపిణీ కార్యక్రమాన్ని కేశినేని ఫౌండేషన్ అధినేత కేసినేని శివనాద్ (చిన్ని) తో కలిసి చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు స్ఫూర్తి తో నిరుపేద విద్యార్థుల చదువుకోసం ఆర్ధికంగా ఆదుకోవడం శివనాధ్ యొక్క మంచి మనస్సును చాటుతోందిని అన్నారు.
గత సంవత్సరం నుండి నందమూరి తారక రామారావు ను స్మరించుకుంటూ సేవా కార్యక్రమాలు ప్రారంభించారని తెలిపారు. నియోజకవర్గంలో జక్కంపూడి కాలనీ మైలవరం ఇబ్రహీంపట్నంలో మెడికల్ క్యాంపు ల ద్వారా 3,063 మంది పేద ప్రజలకు ఉచితంగా కళ్ళజోళ్లను పంపిణీ చేయడం జరిగిందని, అన్నా క్యాంటీలను నిర్వహించడం అభినందనీయమని అన్నారు.
ALSO READ: AP Politics: షర్మిలతో పాటు జగన్ ఇంటికి వెళ్తున్నా.. కాంగ్రెస్ లో కూడా చేరుతున్నా: ఎమ్మెల్యే ఆర్కే
కేశినేని శివనాథ్ మాట్లాడుతూ.. 'జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎక్కడ క్యాంపులు పెడుతున్నారో ఏ పరీక్షలు నిర్వహిస్తున్నారో ఏ మందులు ఇస్తున్నారో కూడా జాడలేదు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే పేదవాళ్ళ కోసం తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పాటు చేసిన అన్న క్యాంటీలను దుర్మార్గంగా రద్దు చేశాడు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మాజీ మంత్రి దేవినేని ఉమా ఎప్పుడు ప్రజల వెంటే ఉంటున్నారు అటువంటి నాయకులను మనం ఎన్నుకోవాలి. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా 160 స్థానాల్లో తెలుగుదేశం జనసేన అభ్యర్థులను గెలిపించుకొని ప్రజా ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవాలి.' అని అన్నారు. చంద్రబాబును ముఖ్యమంత్రిగా చేసుకుని దేవినేని ఉమా గారిని అత్యున్నత స్థానంలో చూసుకుందామని తెలిపారు.